AP High Court Recruitment: ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు.. 1,620 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం

AP High Court Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో ఖాళీలను అధికారులు భర్తీ చేయనున్నారు. ఈమేరకు నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది.

AP High Court Recruitment: ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు.. 1,620 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం

Notification released for 1,620 posts in AP district courts

Updated On : August 3, 2025 / 3:50 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో ఖాళీలను అధికారులు భర్తీ చేయనున్నారు. ఈమేరకు నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది. మొత్తం 1,620 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయనున్నారు. దీనికి సంబదించిన రాత పరీక్షల తేదీలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. పలు పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

మొత్తం 1,620 ఖాళీలలో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ (651) పోస్టులు ఉండగా, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 230 ఉన్నాయి. ఇవే కాకుండా.. ప్రాసెస్ సర్వర్, కాపీయిస్ట్, స్టెనో గ్రాఫర్, డ్రైవర్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ లోనే భర్తీ చేయనున్నారు. వీటిలో డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినెట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పరీక్షల తేదీలు పాతవే ఉండగ.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III/ జూనియర్ అసిస్టెంట్, టైపియిస్ట్/ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలు ఆగస్ట్ 22 నుంచి ఆగస్ట్ 23వ తేదీకి మార్చబడ్డాయి.

పరీక్ష తేదీలు ఇవే:

డ్రైవర్, ప్రాసెస్ సర్వర్ పరీక్షలు 20 ఆగస్టు 2025 న జరుగుతాయి.

ఆఫీస్ సబార్డినెట్ పరీక్షలు 21 ఆగస్టు 2025న జరుగుతాయి

కాపీయిస్ట్, ఎగ్జామనిర్, రికార్డ్ అసిస్టెంట్ పరీక్షలు 22 ఆగస్టు 2025న జరుగుతాయి

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III/ జూనియర్ అసిస్టెంట్, టైపియిస్ట్/ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలు ఆగస్ట్ 22(3 షిఫ్టులు), ఆగస్ట్ 23(షిఫ్ట్ – 3), ఆగస్ట్ 24వ తేదీన (3 షిఫ్టు)లో జరుగుతాయి లు ఉంటాయి.

ఆగస్టు 13న హాల్ టికెట్లు రిలీజ్ చేస్తారు. అధికారిక వెబ్ సైట్ ద్వారా https://aphc.gov.in డౌన్లోడ్ చేసుకోవచ్చు.