NRDRM Recruitment 2025 : ఎన్ఆర్‌డీఆర్ఎమ్‌లో 13,762 ఉద్యోగాలు.. నెలకు జీతం రూ. లక్షా 20వేల వరకు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

NRDRM Recruitment 2025 : నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ వివిధ పోస్టుల కోసం 13,762 ఖాళీలను ప్రకటించింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 24 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

NRDRM Recruitment 2025

NRDRM Recruitment 2025 : నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ (NRDRM) పలు పోస్టులకు సంబంధించి ఉద్యోగాలను ప్రకటించింది. మొత్తం 13, 762 పోస్టులకుగానూ కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ కోఆర్డినేటర్లు, ఎంఐఎస్ (MIS) అసిస్టెంట్లు, మల్టీ-టాస్కింగ్ ఆఫీసర్లు సహా వివిధ పోస్టులకు నియామకాలను ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు అందుబాటులో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ (https://nrdrm.com/)ని విజిట్ చేయొచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 5, 2025న ప్రారంభమైంది. ఫిబ్రవరి 24, 2025న ముగుస్తుంది. మీరు కోరుకున్న పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే ముందు అర్హత ప్రమాణాలను చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం 13,762 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. (NRDRM) రిక్రూట్‌మెంట్ 2025 గురించి అన్ని వివరాలను ఆన్‌లైన్ దరఖాస్తు లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు అర్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : RRB NTPC 2025 : రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. పరీక్ష తేదీలపై ఉత్కంఠ.. ఎంపిక ప్రక్రియ, ఏ పోస్టుకు జీతం ఎంతో తెలుసా?

ఎన్ఆర్డీఆర్ఎమ్ (NRDRM) నోటిఫికేషన్ 2025 :
ఎన్ఆర్డీఆర్ఎమ్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ అధికారికంగా ఫిబ్రవరి 3, 2025న విడుదల అయింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ పోస్టులలో 13,762 ఖాళీలకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ దరఖాస్తుకు ముందు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివి ఆ తర్వాతే అప్లయ్ చేసుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 5 ఫిబ్రవరి 2025 నుండి 24 ఫిబ్రవరి 2025 వరకు అందుబాటులో ఉంది. అర్హతగల అభ్యర్థులు పేర్కొన్న గడువులోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్ఆర్‌డీఆర్ఎమ్ రిక్రూట్‌మెంట్ 2025 :
ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో పనిచేయాలనుకునే అభ్యర్థులకు NRDRM రిక్రూట్‌మెంట్ 2025 ఒక అద్భుతమైన అవకాశం. 13,762 ఖాళీలతో అభ్యర్థులు ఇంజనీరింగ్, పరిపాలన, సాంకేతిక, ఫీల్డ్ కార్యకలాపాలలో తమ విధులను నిర్వర్తించవచ్చు. NRDRM రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్య వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్ఆర్‌డీఆర్ఎమ్ వెబ్ సైట్లో (nrdrm.com) దరఖాస్తు చేసుకోండి.
అర్హత : సంబంధిత విభాగాల్లో (BE/B.Tech, Diploma, Graduation ) పాస్ అయి ఉండాలి
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష + ఇంటర్వ్యూ.
జీతం : నెలకు రూ. 25వేల నుంచి రూ. 1,20,000.
చివరి తేదీ: దరఖాస్తు తేదీల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.

NRDRM ఖాళీల వివరాలివే :
ఈ నియామకంలో భాగంగా కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ కోఆర్డినేటర్లు, ఎంఐఎస్ అసిస్టెంట్లు, మల్టీ-టాస్కింగ్ ఆఫీసర్లు, అనేక ఇతర పోస్టులకు మొత్తం 13762 ఖాళీలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఖాళీలలో 6,881 ఆంధ్రప్రదేశ్‌కు, 6,881 తెలంగాణకు కేటాయించారు. ఈ కింది విధంగా కేటగిరీల వారీగా ఖాళీలను చెక్ చేయండి.

1. ప్రాజెక్ట్ ఆఫీసర్లు
2. ఫీల్డ్ ఆఫీసర్లు
3. జూనియర్ ఇంజనీర్లు (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)
4. డేటా ఎంట్రీ ఆపరేటర్లు
5. టెక్నికల్ అసిస్టెంట్స్

అర్హత ప్రమాణాలివే :

NRDRM రిక్రూట్‌మెంట్ 2025 కి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఈ కింది అర్హత ప్రమాణాలను తప్పక కలిగి ఉండాలి.

విద్యా అర్హత :

ప్రాజెక్ట్ ఆఫీసర్లు : గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్‌మెంట్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ.
ఫీల్డ్ ఆఫీసర్లు : అగ్రికల్చర్, సోషలాజీ లేదా సంబంధిత రంగాలలో బ్యాచిలర్ డిగ్రీ.
జూనియర్ ఇంజనీర్లు : సివిల్, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/BE/B.Tech .
డేటా ఎంట్రీ ఆపరేటర్లు : కనీసం 10+2 అర్హత, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్‌లో ప్రావీణ్యం .
టెక్నికల్ అసిస్టెంట్లు : సంబంధిత రంగాలలో ఐటీఐ/డిప్లొమా.

వయోపరిమితి (Age Limit) :

ప్రాజెక్ట్ ఆఫీసర్లు : 40 సంవత్సరాలు ( గరిష్ట వయోపరిమితి)
ఫీల్డ్ ఆఫీసర్లు : 35 సంవత్సరాలు
జూనియర్ ఇంజనీర్లు : 30 సంవత్సరాలు
డేటా ఎంట్రీ ఆపరేటర్లు & అసిస్టెంట్లు : 28 సంవత్సరాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు :

SC/ST: 5 సంవత్సరాలు
OBC (నాన్-క్రీమీ లేయర్): 3 సంవత్సరాలు
పీడబ్ల్యుడీ అభ్యర్థులు : 10 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ :

ఎన్ఆర్‌డీఆర్ఎమ్ ఈ కింది దశలలో మెరిట్, పనితీరు ఆధారంగా అభ్యర్థుల నియమాకం ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
1. రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT)
జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డొమైన్-స్పెసిఫిక్ నాలెడ్జ్‌, ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు.
2. పర్సనల్ ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ల వెరిఫికేషన్
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.
3. నైపుణ్య పరీక్ష (నిర్దిష్ట స్థానాలకు)
డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఎన్ఆర్‌డీఆర్ఎమ్ రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు ప్రక్రియ :

అధికారిక వెబ్‌సైట్‌ (nrdrm.com)ను సందర్శించండి.
రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను కనుగొనండి.
‘Apply Online’పై క్లిక్ చేయండి.
ముందుగా అధికారిక నోటిఫికేషన్ చెక్ చేయండి.
అవసరమైన వివరాలను నింపండి : వ్యక్తిగత వివరాలు, విద్యా, వృత్తిపరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి.
డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి : మీ ఫోటో, సంతకం, విద్యా ధృవీకరణ పత్రాలు, ఎక్స్‌పీరియన్స్ లెటర్ స్కాన్ చేసిన కాపీలు
దరఖాస్తు రుసుము చెల్లించండి : చెల్లింపు కోసం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించండి.
దరఖాస్తును సమర్పించండి : అన్ని వివరాలను సమీక్షించి, మీ దరఖాస్తును సమర్పించండి.
దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి – భవిష్యత్తు సూచన కోసం ఒక కాపీని ఉంచుకోండి.

Read Also : AP Inter Board Exam 2025 : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు వచ్చేశాయి.. చెక్ చేసుకున్నారా? ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

పోస్టుల వారీగా జీతం ఎంతంటే? :

ప్రాజెక్ట్ ఆఫీసర్లు – నెలకు జీతం : రూ. 60వేల నుంచి రూ. లక్ష 20వేలు వరకు
ఫీల్డ్ ఆఫీసర్లు – నెలకు జీతం : రూ. 40వేల నుంచి రూ. 80వేలు
జూనియర్ ఇంజనీర్లు – నెలకు జీతం : రూ. 35వేల నుంచి రూ. 70వేలు
డేటా ఎంట్రీ ఆపరేటర్లు & అసిస్టెంట్లు – నెలకు జీతం : రూ. 25వేల నుంచి రూ. 50వేలు
అదనపు ప్రయోజనాల కింద వైద్య బీమా, ట్రావెల్ అలవెన్స్, పెన్షన్ కూడా పొందవచ్చు.