ఓయూ తొలి ఆన్‌లైన్ కోర్సు..

ఉస్మానియా యూనివర్శిటీ తొలిసారిగా ఆన్‌లైన్ కోర్సును అందించేందుకు సిద్ధమవుతోంది. ఇంకో రెండు నెలల్లో ‘పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్’ కోర్సును ప్రారంభించనుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, స్టాటిస్టిక్స్ విభాగాలు సంయుక్తంగా ఈ కోర్సు పాఠ్యాంశాలను తయారు చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా 60 యూనివర్శిటీ , కళాశాలలకు UGC 2018 మార్చిలో ఉన్నత స్వయంప్రతిపత్తి హోదా ఇచ్చింది. అందులో OU ఒకటి. ఈ హోదా కింద UGC అనుమతి లేకుండానే దూరవిద్య, ఆన్‌లైన్ కోర్సులను అందించే స్వేచ్ఛ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే దూరవిద్యలో BED కోర్సుకు ప్రవేశ ప్రకటన జారీచేసిన వర్సిటీ.. తాజాగా ఆన్‌లైన్ కోర్సును అందించేందుకు ప్రయత్నం చేస్తోంది.