pgcil recruitment 2025
PGCIL Jobs : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో గోల్డెన్ ఛాన్స్.. ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ (PGCIL)లో ఉద్యోగాలు పడ్డాయి. యువతకు అద్భుతమైన అవకాశం.. పవర్‌గ్రిడ్‌లో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది.
ఆలస్యం చేయకుండా ఈ జాబ్స్ కోసం ఇప్పుడే అప్లయ్ చేసుకోండి. ఎందుకంటే.. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష ఉండదు. అర్హతలను బట్టి నేరుగా ఉద్యోగంలో ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో మొదలైంది.
Read Also : Oppo F29 Launch : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో F29 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 20నే లాంచ్.. ధర ఎంతో తెలిసిందోచ్..!
ఆసక్తి గల అభ్యర్థులు పవర్‌గ్రిడ్ అధికారిక వెబ్‌సైట్ (www.powergrid.in) విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ 12 మార్చి 2025 మాత్రమే. మీకు ఆసక్తి ఉంటే.. త్వరగా దరఖాస్తు చేసుకోండి.
పూర్తి ఖాళీలివే :
మేనేజర్ (ఎలక్ట్రికల్) 9 ఖాళీలు
డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్) 48 ఖాళీలు
అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 58 ఖాళీలు
అర్హతలివే :
ఈ పోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థులు B.E/B.tech/B.Sc (ఇంజనీరింగ్) ఎలక్ట్రికల్‌లో డిగ్రీ చేసి ఉండాలి. అలాగే, సంబంధిత రంగంలో ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసి చెక్ చేసుకోండి.
వయోపరిమితి ఎంతంటే? :
అభ్యర్థుల పోస్టులను అనుసరించి వయోపరిమితిలో మార్పు ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 39 ఏళ్ల వరకు ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
జీతం, బెనిఫిట్స్ :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60వేల నుంచి రూ.2 లక్షల 20వేల వరకు వేతనం వస్తుంది. అంతేకాదు.. ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా పొందవచ్చు.
ఎంపిక ప్రక్రియ ఇలా :
ఎంపిక ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఉండదని గమనించాలి.
రుసుము ఎంతంటే? :
దరఖాస్తు రుసుము రూ.500 చెల్లించాలి. SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేదు.