Education Loan : హైయర్ స్టడీస్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్ ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేయాలో తెలుసా?

Education Loan : ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ అనేది సాధారణంగా కోర్సు పూర్తయిన ఒక ఏడాది తర్వాత ప్రారంభమవుతుంది. తద్వారా విద్యార్థులు తిరిగి చెల్లించేందుకు గ్రేస్ పీరియడ్ పొందవచ్చు.

Education Loan

Education Loan : విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశాల్లో హైయర్ స్టడీస్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ముందుగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో ఉన్నత విద్య అనేది అత్యంత ఖరీదైనదిగా మారింది. ప్రవేశ పరీక్షలు, కోచింగ్, కాలేజీ ఫీజులు, జీవన వ్యయం వంటి ఖర్చులను ఎక్కువగా భరించాల్సి ఉంటుంది.

ప్రొఫెషనల్ కోర్సుల కోసం.. మొత్తం ఖర్చు రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉండవచ్చు. విదేశాలలో చదువుకోవడం వల్ల ఖర్చు మొత్తం కూడా మరింత పెరుగుతుంది. ఇలాంటి సందర్భాలలో ఆర్థిక సాయం అందించడం ద్వారా విద్యార్థులు తమ ఉన్నత విద్యను పూర్తి చేయొచ్చు.

Read Also : Vivo T4 5G : వివో క్రేజే వేరు.. కొత్త వివో T4 5G ఫోన్ చూస్తే మీరు ఇదే అంటారు.. ఫీచర్లు మాత్రం హైరేంజ్ అంతే.. ధర ఎంతో తెలుసా?

ఆ తర్వాత ఉపాధిని పొందిన తర్వాత రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. మీరు కూడా ఉన్నత చదువుల కోసం చూస్తుంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. వివిధ రకాల ఎడ్యుకేషన్ లోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ పొందాలంటే లోన్ కోసం ఎలా అప్లయ్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఎడ్యుకేషన్ లోన్ బెనిఫిట్స్ ఏంటి? :

  • కోర్సు, సంస్థను బట్టి రూ. 1 కోటి వరకు రుణాలు పొందవచ్చు.
  • రుణాన్ని తిరిగి చెల్లించేందుకు 15 ఏళ్ల వరకు సమయం ఉంటుంది.
  • భారత్, విదేశాలలో ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ అందుబాటులో ఉంది.
  • కొన్ని బ్యాంకులు విదేశీ విద్య కోసం వీసా మంజూరుకు ముందే పాక్షిక రుణాన్ని చెల్లిస్తాయి.
  • లోన్ దరఖాస్తు ఆమోద ప్రక్రియ విద్యార్థులకు చాలా సులభంగా ఉంటుంది.
  • మహిళా విద్యార్థులు, బ్యాంకు ఉద్యోగుల పిల్లలకు వడ్డీ రాయితీలు ఉంటాయి.
  • కోర్సు పూర్తయిన తర్వాత ఒక ఏడాది వరకు రీపేమెంట్ ఉంటుంది.
  • గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది.

ఎడ్యుకేషన్ లోన్లు ఎన్ని రకాలంటే? :

  • అండర్ గ్రాడ్యుయేట్ లోన్ : ప్రారంభ కాలేజీ చదువుల కోసం.
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ లోన్ : గ్రాడ్యుయేషన్ తర్వాత పై ఉన్నత చదువుల కోసం.
  • ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ లోన్ : స్కిల్ డెవలప్‌మెంట్, సర్టిఫికేషన్, కెరీర్-అడ్వాన్సింగ్ కోర్సుల కోసం.
  • పేరెంట్స్ లోన్ : తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం ఈ రుణాన్ని పొందొచ్చు.

ఎడ్యుకేషన్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? :

  • మీరు దరఖాస్తు చేసే బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • వెబ్‌సైట్‌లోని ‘Education Loan’ సెక్షన్ నావిగేట్ చేయండి.
  • అవసరమైన అన్ని వ్యక్తిగత, విద్యా, కోర్సు సంబంధిత వివరాలతో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను నింపండి.
  • ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, అకాడిమిక్ రికార్డులు, అడ్మిషన్ లెటర్, ఇన్‌కమ్ ప్రూఫ్ వంటి అన్ని అవసరమైన డాక్యుమెంట్లను జత చేయండి.
  • రివ్యూ కోసం మీ అప్లికేషన్ సమర్పించండి.
  • బ్యాంక్ మీ వివరాలు, డాక్యుమెంట్లను ధృవీకరిస్తుంది.
  • అన్ని సరిగ్గా ఉంటే.. లోన్ మొత్తం అప్రూవల్ అవుతుంది.
  • నిబంధనల ప్రకారమే రుణాన్ని అందిస్తుంది.

ఆఫ్‌లైన్‌లో ఎడ్యుకేషన్ లోన్ ఎలా అప్లయ్ చేయాలి? :

Read Also :  OnePlus 12 Price : పండగ చేస్కోండి.. అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ధర భారీగా తగ్గిందోచ్.. ఇలా చేస్తే మీ సొంతమే!

  • మీకు ఇష్టమైన బ్యాంకు సమీప బ్రాంచ్ విజిట్ చేయండి.
  • లోన్ ఆఫీసర్ లేదా కస్టమర్ సర్వీస్ డెస్క్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫారమ్ కోసం అడగండి.
  • మీ వ్యక్తిగత, విద్యా, కోర్సు సంబంధిత వివరాలతో ఫారమ్‌ను నింపండి.
  • ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, అకాడిమిక్ రికార్డులు, అడ్మిషన్ లెటర్, ఇన్‌కమ్ ప్రూఫ్ వంటి అన్ని అవసరమైన డాక్యుమెంట్లను జత చేయండి.
  • పూర్తి చేసిన ఫారమ్, డాక్యుమెంట్లను బ్యాంక్‌లో సమర్పించండి.
  • బ్యాంక్ మీ దరఖాస్తును రివ్యూ చేసి ధృవీకరిస్తుంది.
  • అన్నీ సవ్యంగా ఉంటే.. లోన్ మంజూరు అవుతుంది.
  • కొద్దికొద్దిగా మొత్తం రుణాన్ని అందిస్తుంది.