తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సిలింగ్ వాయిదాపడింది. పాలిటెక్నిక్ కాలేజీల అనుబంధ గుర్తింపు వ్యవహారం తేలవకపోవడంతో మంగళవారం మే 14న నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సిలింగ్ ను వాయిదా వేసినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. మే 17నుంచి ప్రవేశాల కౌన్సిలింగ్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మే 14నుంచి నిర్వహించేలా జారీ చేసిన షెడ్యూల్ మే 17నుంచి ప్రారంభమవుతుందని, రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్, నిర్ణీత తేదీల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆఫ్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కొత్త షెడ్యూల్ ను మళ్లీ ప్రకటిస్తామని తెలిపారు.
ఇన్ చార్చి కమిషనర్ గా విజయ్ కుమార్
కళాశాల విద్య, సాంకేతిక విద్యా ఇన్ ఛార్చి కమిషనర్ గా పాఠశాల విద్యా కమిషనర్ విజయ్ కుమార్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కళఆశాల విద్య, పాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్లల్ సోమవారం నుంచి మే 17వరకూ సెలవులో వెళ్లిన కారణంగా.. విజయ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.