PGCIL Recruitment : పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగం లో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్) ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఉత్తీర్ణతోపాటు పనిలో అనుభవం కలిగి ఉండాలి.

PGCIL Recruitment : పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీల భర్తీ

POWER GRID Job Vacancies

Updated On : December 22, 2022 / 6:29 PM IST

PGCIL Recruitment : పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న పవర్ గ్రిడ్ కేంద్రాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీల వివరాలను పరిశీలిస్తే డిప్యూటీ మేనేజర్ (ఏఐ,ఎంఎల్) 2ఖాళీలు, డిప్యూటీ మేనేజర్(ఎస్ఏపీ, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంట్, పెరోల్ ట్రెజరీ అండ్ రిస్క్ మేనేజ్ మెంట్ , మెటీరియల్స్ మేనేజ్ మెంట్ , క్వాలిటీ మేనేజ్ మెంట్ , బిజినెస్ అనలిటిక్స్, ప్రాజెక్ట్ సిస్టమ్స్) 6 ఖాళీలు, డిప్యూటీ మేనేజర్ (ఎస్ఏపి, బేసిక్ ఈసీసీ, ఈపీ, యూఐపీ 1 ఖాళీ, అసిస్టెంట్ మేనేజర్ (క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంట్) 1ఖాళీల, అసిస్టెంట్ మేనేజర్ (డేటా ఇంజినీర్) 1 ఖాళీ, అసిస్టెంట్ మేనేజర్ (ఎస్ఏపీ, ఏబీఏపీ, వెబ్ డిన్ ప్రో , ఏబీఏపీ 4 ఖాళీలు, డిప్యూటీ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 4 ఖాళీలు అసిస్టెంట్ మేనేజర్ ఒపెన్ సోర్స్ అప్లికేషన్ డెవలపర్ 4 పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగం లో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్) ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఉత్తీర్ణతోపాటు పనిలో అనుభవం కలిగి ఉండాలి.

ఇంటర్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు డిప్యూటీ మేనేజర్ కు 70,000ల నుండి 2,00000, అసిస్టెంట్ మేనేజర్ కు 60,000 నుండి 1, 80,000వరకు చెల్లిస్తారు.

అభ్యర్ధులు అన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా 14 జనవరి 2023ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు