PNB Recruitment 2025 : పంజాబ్ బ్యాంకు రిక్రూట్‌మెంట్.. పరీక్ష లేకుండానే జాబ్.. నెలకు రూ. 64వేలు జీతం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

PNB Recruitment 2025 : పంజాబ్ బ్యాంకు రిక్రూట్‌మెంట్.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల దరఖాస్తుదారులు జనవరి 24,2025లోపు దరఖాస్తు చేయొచ్చు.

Punjab Bank Recruitment 2025

PNB Recruitment 2025 : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

Read Also : CBSE CTET Answer Key 2024 : సీబీఎస్ఈ సీటెట్ ఆన్సర్ కీ 2024 త్వరలో విడుదల.. డేట్, టైమ్ అప్‌‌టేట్ వివరాలివే!

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల దరఖాస్తుదారులు తమ ఫారమ్‌లను జనవరి 24,2025లోపు సమర్పించినట్లు నిర్ధారించుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 9 ఖాళీలను పూరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. స్పోర్ట్స్ కోటా కిందకు వస్తుంది.

అర్హత :
కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లార్క్ క్యాడర్) పాత్రకు అర్హత పొందాలంటే.. అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు కోసం, దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా 20 ఏళ్లు నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ఆఫీస్ అసిస్టెంట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా 18ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయస్సులోపు ఉండాలి.

జీతం :
ఎంపికైన అభ్యర్థులు పే స్కేల్ ప్రకారం.. నెలవారీ జీతం అందుకుంటారు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌లు రూ. 24,050, రూ. 64,480 మధ్య సంపాదిస్తారు. ఆఫీస్ అసిస్టెంట్లు రూ. 19,500 నుంచి రూ. 37,815 వరకు జీతం పొందుతారు.

ఎంపిక ప్రక్రియ :
ఎంపిక ప్రక్రియలో రెండు కీలక దశలు ఉంటాయి. ప్రారంభంలో, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ఫీల్డ్ ట్రయల్స్‌లో పాల్గొంటారు. వారి పనితీరు ఆధారంగా, ఇంటర్వ్యూ పిలుస్తారు. ఫైనల్ ఆప్షన్ నిర్ణయిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తుదారులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన తర్వాత ఫారమ్ తప్పనిసరిగా అవసరమైన డాక్యుమెంట్ల కాపీలతో పాటు ఈ కింది చిరునామాకు పంపాలి.

  • చీఫ్ మేనేజర్ (రిక్రూట్‌మెంట్ విభాగం),
  • HR విభాగం, పంజాబ్ నేషనల్ బ్యాంక్,
  • కార్పొరేట్ ఆఫీస్, 1వ అంతస్తు, వెస్ట్ వింగ్,
  • ప్లాట్ నెం. 4, సెక్టార్ 10, ద్వారక,
  • న్యూఢిల్లీ – 110075.

మరిన్ని వివరాలు, దరఖాస్తు ఫారమ్‌ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. పంజాబ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025ని చెక్ చేయండి .

Read Also : Maha Kumbh Mela 2025 : మహాకుంభమేళా కోసం గూగుల్ గౌరవవందనం.. ఇలా సెర్చ్ చేస్తే పూల జల్లు కురుస్తుంది..!