Maha Kumbh Mela 2025 : మహాకుంభమేళా కోసం గూగుల్ గౌరవవందనం.. ఇలా సెర్చ్ చేస్తే పూల జల్లు కురుస్తుంది..!
Maha Kumbh Mela 2025 : గూగుల్‌లో మహా కుంభ్‌ని సెర్చ్ చేసిన తర్వాత వినియోగదారులు తమ కంప్యూటర్ స్క్రీన్‌లపై ప్రత్యేక పూల జల్లును చూడవచ్చు.

Maha Kumbh Mela 2025
Maha Kumbh Mela 2025 : ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్ రాజ్ వేదికగా అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహా కుంభమేళా’ ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి సోమవారం (జనవరి 13) తెల్లవారుజామునుంచే భక్తులు త్రివేణి సంగమానికి పెద్దఎత్తున చేరుకుంటున్నారు.
అతిపెద్ద ఉత్సావాల్లో ఒకటైన ఆధ్యాత్మిక కార్యక్రమం (Maha Kumbh Mela 2025) ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. పవిత్ర స్నానం కోసం త్రివేణి సంగమం-గంగా, యమునా, సరస్వతి సంగమం వద్ద సందర్శకుల భారీగా తరలివస్తారని భావిస్తున్నారు.
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా ఈ ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా వేడుకలతో మరింత ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
భగవంతుడు పట్ల భక్తిని తెలియజేసేలా పూల ట్విస్ట్‌తో క్లాసిక్ యానిమేషన్‌ను గూగుల్ ప్రదర్శించింది. ఇది ఎలా పని చేస్తుందో తెలుసా? మీరు చేయాల్సిందల్లా సెర్చ్ ఇంజిన్‌లో “kumbh mela” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. సంబంధిత సెర్చ్ రిజల్ట్స్‌లో వినియోగదారులు పూల రేకుల జల్లును చూడగలరు.
Google search for Kumbh pic.twitter.com/iGgWeI74Ri
— SpectatorX 🇺🇲🇮🇳🇮🇱🏳️🌈 (@Sp3ctat0r67) January 13, 2025
స్క్రీన్ దిగువన కనిపించే పింక్ కలర్ (Button) కన్ఫెట్టి సింబల్ క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులకు పూలరేకుల వర్షంతో స్వాగతం పలుకుతుంది. పండుగ స్ఫూర్తిని సంపూర్ణంగా అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ప్రత్యేకమైన డూడుల్ ఫొటో స్క్రీన్‌షాట్‌లను వినియోగదారులు ఆసక్తిగా షేర్ చేయడంతో గూగుల్ ట్రిబ్యూట్ ఫొటో వైరల్‌గా మారింది.
మహా కుంభమేళా 2025 :
మహా కుంభమేళా 2025 సోమవారం (జనవరి 13) త్రివేణి సంగమం వద్ద అధికారికంగా ప్రారంభమైంది. మొదటి పవిత్ర స్నానం కోసం విభిన్న నేపథ్యాల నుంచి 4 మిలియన్లకు పైగా భక్తులు వచ్చారు. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన ఈ మహాకుంభమేళాకు ఈ ఏడాది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 45 రోజుల పండుగ ప్రారంభానికి ముందే అన్ని సన్నాహాలు పూర్తి చేశారు.
నది ఒడ్డున 4వేల హెక్టార్ల బహిరంగ ప్రదేశంలో తాత్కాలిక నగరాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతీయ భక్తులతో పాటు విదేశాల నుంచి లక్షలాది మంది విదేశీ పర్యాటకులు రానున్నారు. 2013లో జరిగిన మహా కుంభమేళాకు 10 కోట్ల మంది హాజరయ్యారు. ఈ మహాకుంభమేళా ఉత్సవాల ద్వారా రూ.12వేల కోట్ల ఆదాయం సమకూరడంతో పాటు 6 లక్షల ,50వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి.
Read Also : Maha Kumbh mela: ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం.. త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తజనం