Railway RRC Recruitment 2025 : రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. నో ఎగ్జామ్.. జీతం ఎంతంటే?

Railway RRC Recruitment 2025 : రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు పడ్డాయి. 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ కూడా చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి పోటీ పరీక్ష లేదు. అర్హతలు, ఖాళీలు? దరఖాస్తు ప్రక్రియ వివరాలను తెలుసుకుందాం.

Railway RRC Recruitment 2025

Railway RRC Recruitment 2025 : రైల్వే ఉద్యోగాల కోసం చూస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. రైల్వేలో కొత్త రిక్రూట్‌మెంట్ అభ్యర్థుల కోసం లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఆర్ఆర్‌సీ (RRC) సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) అప్రెంటిస్‌ల నియామకం కోసం దరఖాస్తులను కోరుతోంది.

ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ (secr.indianrailways.gov.in) లేదా (www.apprenticeshipindia.gov.in)లో ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నియామకానికి దరఖాస్తు ఫారాలు 25 మార్చి 2025 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.

Read Also : AC Price Drop : వావ్.. భారీగా తగ్గిన ఏసీల ధరలు.. ఇందులో చాలా తక్కువ అంట.. ఇప్పుడే ఇంటికి కొని తెచ్చుకోండి!

అప్లికేషన్ పూర్తి చేసేందుకు ఇదే చివరి తేదీ. ఆ తరువాత దరఖాస్తులు ఏ ఫార్మాట్‌లోనూ అంగీకరించరని గమనించాలి. రైల్వే అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు :
ఈ రైల్వే అప్రెంటిస్ పోస్టుల్లో కార్పెంటర్, డ్రాఫ్ట్స్‌మన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, స్టెనోగ్రాఫర్ హిందీతో సహా వివిధ ట్రేడ్‌లు ఉన్నాయి. ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.

అర్హతలివే :
ఈ రైల్వే అప్రెంటిస్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండటం తప్పనిసరి. రిక్రూట్‌మెంట్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థుల అర్హతను కూడా చెక్ చేయవచ్చు.

వయోపరిమితి :
రైల్వే అప్రెంటిస్ పోస్టుల దరఖాస్తుకు అభ్యర్థుల కనీస వయస్సు 15 ఏళ్లు, గరిష్ట వయస్సు 24 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీ : 2025 మార్చి 25 ఆధారంగా వయోపరిమితి లెక్కిస్తారు.
ఎంపిక ప్రక్రియ : అభ్యర్థుల ఎంపికకు పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల ఆధారంగా నేరుగా మెరిట్ జాబితా ఉంటుంది.
జీతం (స్టయిపెండ్) : ఎంపికైన అభ్యర్థులకు నిర్ణీత స్టైపెండ్ చెల్లిస్తారు.
అప్రెంటిస్‌షిప్ వ్యవధి : ఒక ఏడాది

Read Also : Upcoming Mobiles in March 2025 : మార్చిలో రిలీజయ్యే స్మార్ట్‌ఫోన్లు ఇవే.. లాంచ్ తేదీలు, ఫీచర్లు, ధరలు మీకోసం.. ఓసారి లుక్కేయండి!

దరఖాస్తు రుసుము : అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా రైల్వే అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లయ్ చేసే అభ్యర్థులు పోర్టల్‌లోని అర్హత సెక్షన్‌‌లో 10వ తరగతి, ఐటీఐ మార్కులను తప్పక చేర్చాలి. లేకుంటే మీ దరఖాస్తు ఆటోమాటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. ఈ రైల్వే రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఇతర సమాచారం కోసం అభ్యర్థులు (RRC) సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు.