NABARD : నాబార్డ్ లో ఉద్యోగాల భర్తీ

రాత పరీక్ష అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జులై 18 , 2022 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్ట్ 7, 2022గా నిర్ణయించారు.

NABARD : నాబార్డ్ లో ఉద్యోగాల భర్తీ

Jobs

Updated On : July 12, 2022 / 8:02 PM IST

NABARD : భారత ప్రభుత్వ రంగ సంస్ధ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 170 ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలను పరిశీలిస్తే రూరల్ డెవలప్ మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ పోస్టులు 161, రాజ్ భాష సర్వీస్ పోస్టులు 7, ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ పోస్టులు 2 ఖాళీలు ఉన్నాయి.

రాత పరీక్ష అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జులై 18 , 2022 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్ట్ 7, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nabard.org/ పరిశీలించగలరు.