JOBS : టీ బోర్డు ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్ డీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

Tea Board India

JOBS : కోల్ కతా లోని టీ ఆఫ్ బోర్డు ఇండియా లో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 6 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి సీనియర్ సైంటిస్ట్ 1 ఖాళీ, జూనియర్ సైంటిస్ట్ 3 ఖాళీలు, ఫ్యాక్టరీ అసిస్టెంట్ 1 ఖాళీ, ఫార్మ్ అసిస్టెంట్ 1 ఖాళీ ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్ డీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు 30,000 రూ నుండి 60,000రూ వరకు వేతనంగా చెల్లిస్తారు.

అభ్యర్ధులు దరఖాస్తులను ఈ మెయిల్, ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు పంపేందుకు ఆఖరు తేదిగా జులై 24, 2022 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.teaboard.gov.in పరిశీలించగలరు.