Jobs
JOBS : భారత ప్రభుత్వ రంగానికి చెందిన యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. సివిల్, మిల్, మైన్స్, స్టోర్స్, పర్చేజ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ, తత్సమాన ఉత్తీర్ణతతోపాటు , పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 45 నుండి 48 మధ్య ఉండాలి. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేది ఆగస్ట్ 8, 2022గా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; జనరల్ మేనేజర్ , యూరేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జాదుగూడ్ మైన్స్, ఝూర్ఖండ్-832102, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.ucil.gov.in
పరిశీలించగలరు.