RBI Assistant Vacancy : ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

RBI Assistant Vacancy

RBI Assistant Vacancy : ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 450 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Appsc Exam Schedule : ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష తేదీలకు వెల్లడించిన ఏపీపీఎస్సీ

ఆయా ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి అహ్మదాబాద్: 13, బెంగళూరు: 58, భోపాల్: 12, భువనేశ్వర్: 19, చండీగఢ్: 21, చెన్నై: 01, గువాహటి: 26, హైదరాబాద్: 14, జైపుర్: 5, జమ్మూ: 18, కాన్పుర్ & లక్నో: 55, కోల్‌కతా: 22, ముంబయి: 101, నాగ్‌పుర్: 19, న్యూఢిల్లీ: 28, పట్నా: 01, తిరువనంతపురం & కొచ్చి: 16 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత భాషలో ప్రావీణ్యం ఉండాలి. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం మినహాయింపు వర్తిస్తుంది.

READ ALSO : Hearing Loss : వినికిడి ప్రమాదం రాకుండా ఉండాలంటే ?

ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.20,700 నుంచి రూ.55700 చెల్లిస్తారు.

అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్‌ 10 చివరి గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://rbi.org.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు