Appsc Exam Schedule : ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష తేదీలకు వెల్లడించిన ఏపీపీఎస్సీ

ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించి పేపర్ 1, పేపర్ 2 పరీక్షలను నిర్వహించనున్నారు.

Appsc Exam Schedule : ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష తేదీలకు వెల్లడించిన ఏపీపీఎస్సీ

various vacancies

Appsc Exam Schedule : ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌), గ్రూప్-4 సర్వీసెస్‌లో వివిధ ఖాళీలు, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆపీసర్ (ఏపీ జువైనల్ వెల్ఫేర్ కోరిలేషనల్ సబ్ సర్వీసెస్‌), టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్), అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (మత్స్యశాఖ), జూనియర్ ట్రాన్స్‌లేటర్-తెలుగు (ఏపీ), టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ మైన్స్ & జియోలజీ సబ్ సర్వీస్), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్). తదితర పోస్టులకు అక్టోబరు 3న జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) పరీక్ష నిర్వహించనున్నారు.

REDA ALSO : MLA Ganta Srinivasa Rao: చంద్రబాబు అరెస్టు విషయంలో జూ.ఎన్టీఆర్ తీరుపట్ల గంటా ఆసక్తికర వ్యాఖ్యలు

పేపర్-2 పరీక్ష షెడ్యూలుకు సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌) 27.09.2023 , గ్రూప్-4 సర్వీసెస్‌లో వివిధ పోస్టులు 04.10.2023, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆపీసర్ (ఏపీ జువైనల్ వెల్ఫేర్ కోరిలేషనల్ సబ్ సర్వీసెస్‌) 05.10.2023 , జూనియర్ ట్రాన్స్‌లేటర్-తెలుగు (ఏపీ) 05.10.2023,టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) 27.09.2023, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (మత్స్యశాఖ): 27.09.2023, టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ మైన్స్ & జియోలజీ సబ్ సర్వీస్) 05.10.2023, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్): 04.10.2023. పరీక్ష నిర్వహించనున్నారు.

YashoBhoomi In Delhi : ఢిల్లీలో మరో అద్భుతం ‘యశోభూమి’.. రేపే ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం.. ప్రత్యేకతలేంటో తెలుసా..?

హాల్‌టికెట్లు డౌన్ లోడ్ ;

అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (మత్స్యశాఖ), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌), టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్-ఏపీ గ్రౌండ్ వాటర్) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌టికెట్లను సెప్టెంబరు 19 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

APPSC

APPSC