Cochin Shipyard : కొచ్చిన్ షిప్‌యార్డు లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే నాలుగు, పదో తరగతి, డిప్లొమా (సేఫ్టీ/ ఫైర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Cochin Shipyard Limited

Cochin Shipyard : కొచ్చిన్ షిప్‌యార్డు కాంట్రాక్ట్ ప్రాతిపదికన సేఫ్టీ అసిస్టెంట్, సెమీ స్కిల్డ్ రిగ్గర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 95 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో సెమీ స్కిల్డ్ రిగ్గర్: 56 పోస్టులు, సేఫ్టీ అసిస్టెంట్: 39 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిని అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Israeli Prime Minister Benjamin Netanyahu : హమాస్ మిలిటెంట్లందరినీ చంపేస్తా…ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే నాలుగు, పదో తరగతి, డిప్లొమా (సేఫ్టీ/ ఫైర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వయోపరిమితి 30 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

READ ALSO : Lemon Grass Tea : నొప్పుల నుండి ఉపశమనం కలిగించంతోపాటు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించే లెమన్ గ్రాస్ టీ !

దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 21.10.2023గా నిర్ణయించారు. అభ్యర్థులు అక్టోబర్ 21 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://cochinshipyard.in/ పరిశీలించగలరు.