Lemon Grass Tea : నొప్పుల నుండి ఉపశమనం కలిగించంతోపాటు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించే లెమన్ గ్రాస్ టీ !

HIV వంటి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులను ప్రభావితం చేసే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించే సామర్ధ్యాన్ని లెమన్‌గ్రాస్ టీ కలిగి ఉన్నట్లు తేలింది. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి , నోటిని శుభ్రంగా ఉంచడానికి లెమన్ గ్రాస్ కాడలను నమలటం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు.

Lemon Grass Tea : నొప్పుల నుండి ఉపశమనం కలిగించంతోపాటు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించే లెమన్ గ్రాస్ టీ !

Lemon Grass Tea

Lemon Grass Tea : లెమన్‌గ్రాస్ టీ వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ను నివారించడం మొదలు లెమన్ గ్రాస్ టీతో బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందుతాయి. లెమన్ గ్రాస్ సముద్రపు గడ్డి ఆకులను పోలి ఉండి పొడవైన ఆకులను కలిగి ఉంటుంది. లెమన్‌గ్రాస్‌లో 55 జాతులు ఉన్నాయి. వాటిలో ఈస్ట్ ఇండియన్, వెస్ట్ ఇండియన్ రకాలను మాత్రమే ఉపయోగించేందుకు అనుకూలంగా ఉంటాయి.

READ ALSO : BRS Petition : కారును పోలిన గుర్తులు ఏ పార్టీకి కేటాయించకూడదంటూ.. ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ రిట్ పిటిషన్ దాఖలు

లెమన్‌గ్రాస్ టీ తాగటం వల్ల బహుళ ఆరోగ్య ప్రయోజనాలు ;

లెమన్ గ్రాస్ టీ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. తద్వారా శరీరంలో మంట తగ్గేలా చేస్తుంది. నిమ్మగడ్డిలో క్లోరోజెనిక్ యాసిడ్, ఐసోరియంటిన్ ,స్వెర్టియాజపోనిన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. నొప్పి, గుండె జబ్బులతో సహా అనేక అనారోగ్య పరిస్ధితులకు లెమన్‌గ్రాస్ టీ ప్రయోజనకరమైన పానీయంగా చెప్పవచ్చు. వేడి లెమన్ గ్రాస్ టీని తీసుకోవటం వల్ల రిలాక్స్‌గా ఉంటుందని చాలా మంది భావిస్తారు, అయితే లెమన్‌గ్రాస్ టీఆందోళనను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. లెమన్‌గ్రాస్ వాసన ఆందోళనతో బాధపడేవారి ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుంది.

READ ALSO : Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు పాటించాల్సిన ఆహార నియమాలు

లెమన్‌గ్రాస్ రసాన్ని తీసుకోవడం వల్ల ఒక అధ్యయనంలో జంతువులలో కొలెస్ట్రాల్ తగ్గినట్లు గుర్తించారు. మనుషులలో కూడా లెమన్‌గ్రాస్ కొలెస్ట్రాల్‌ను తగ్గించటంలో సహాయపడుతుందని పరిశోధన ద్వారా తేలింది. HIV వంటి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులను ప్రభావితం చేసే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించే సామర్ధ్యాన్ని లెమన్‌గ్రాస్ టీ కలిగి ఉన్నట్లు తేలింది. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి , నోటిని శుభ్రంగా ఉంచడానికి లెమన్ గ్రాస్ కాడలను నమలటం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు. నోటిలో బాక్టీరియా పెరుగుదలను నిరోధించే వాటిలో లెమన్‌గ్రాస్ శక్తివంతమైనవని నిపుణులు కనుగొన్నారు.

READ ALSO : Supreme Court : మహిళ గర్భ విచ్చిత్తిపై ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విభిన్న తీర్పులు

లెమన్ గ్రాస్ టీ నొప్పిని తగ్గిస్తుంది. లెమన్‌గ్రాస్ టీ తాగడం వల్ల వివిధ రకాల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ లెమన్‌గ్రాస్ టీ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్ధాయిలు పెరగటంతోపాటు ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతున్నట్లు తేలింది. లెమన్ గ్రాస్ టీ తాగటం వల్ల మూత్రపిండాల పనితీరు సాదారణం కంటే బాగా ఉంటుంది. పొట్టలో నీరు చేరి , పొట్ట ఉబ్బరంగా ఉన్న సందర్భాల్లో లెమన్ గ్రాస్ టీ తాగటం వల్ల మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. మెదడు పనితీరు పై కూడా దీని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.