Supreme Court : మహిళ గర్భ విచ్చిత్తిపై ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విభిన్న తీర్పులు

మహిళ గర్భంలోని పిండం గుండె చప్పుడు నిలిపివేయాంటూ ఏ న్యాయస్థానం తీర్పు చెబుతుంది? అని జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు.

Supreme Court : మహిళ గర్భ విచ్చిత్తిపై ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విభిన్న తీర్పులు

Supreme Court

Supreme Court – Woman Abortion : ఓ మహిళ గర్భ విచ్చిత్తికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు విభిన్న తీర్పులు వెల్లడించారు. ఒక మహిళ 26 వారాల గర్భ విచ్చిత్తికి తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇద్దరు న్యాయమూర్తులు భిన్న తీర్పులు ఇచ్చారు.

గర్భ విచ్ఛిత్తి అనుమతికి అయిష్టత చూపుతూ ఒక జడ్జీ, ఆ మహిళ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలంటూ మరో న్యాయమూర్తి విభిన్న తీర్పులు చెప్పారు. మహిళ గర్భంలోని పిండం గుండె చప్పుడు నిలిపివేయాంటూ ఏ న్యాయస్థానం తీర్పు చెబుతుంది? అని జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు.

World Record : మూడు నెలల పసిబిడ్డ ప్రపంచ రికార్డ్ ..!!

‘ఆమె నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిందే’ అంటూ జస్టిస్ బీవీ నాగరత్న తెలిపారు. దీనిని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలంటూ ఇరువురు న్యాయమూర్తులు నిర్ణయించారు.