Jobs
JOBS :కేరళ తిరువనంతపురంలోని రైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 3 సెక్షన్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలోమూడుళ్ళ కాలం పని అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాలకు మించరాదు. ఎంపికైన వారికి నెలకు 46,250రూ నుండి 1,31,700 రూ వరకు వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపవచ్చు. ఈ మెయిల్ అడ్రస్ info@keralarail.com, అఫ్ లైన్ విధానంలో
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; మేనేజింగ్ డైరెక్టర్, కేఆర్ డీసీఎల్, 5వ అంతస్తు, ట్రాన్స్ టవర్స్, తిరువనంతపురం .