BECIL Recruitment : బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ లో ఒప్పంద ఖాళీల భర్తీ
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, బీటెక్, బీఈ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీ, ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగిఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published On : September 22, 2022 / 02:36 PM IST
BECIL
BECIL Recruitment : న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 160 డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ బాయ్, డేటా అనలిస్ట్, సోషల్ మీడియా అనలిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, కంటెంట్ రైటర్, అసోసియేట్ కన్సల్టెంట్, క్రియేటివ్ కంటెంట్ రైటర్, గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్, కన్సల్టెంట్, సీనియర్ కంటెంట్ రైటర్, సీనియర్ కన్సల్టెంట్,ప్రాజెక్ట్ లీడ్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్,ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులభర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, బీటెక్, బీఈ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీ, ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగిఉండాలి.
అర్హతలు ఉన్న అభ్యర్ధులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.8,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ప్రక్రియ సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు కొనసాగనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.becil.com/ పరిశీలించగలరు.