Cochin Shipyard Recruitment
Cochin Shipyard Recruitment : భారత ప్రభుత్వ రంగ సంస్ధ కొచ్చిన్ షిప్ యార్డులో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 76 డ్రాప్ట్స్ మ్యాన్ ట్రైయినీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Mechanization in Paddy : వ్యవసాయంలో కూలీల కొరత.. అధిగమించేందుకు యాంత్రీకరణ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే షిప్ డ్రాప్ట్స్ మన్ మెకానికల్ ట్రైనీ పోస్టుకు 60శాతం మార్కులతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. షిప్ డ్రాఫ్ట్స్ మన్ ట్రైనీ ఎలక్ట్రికల్ పోస్టుకు 60 శాతం మార్కులతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 25 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి అకడమిక్ మార్కులు, ఆన్ లైన్ పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. నెలకు వేతనంగా 12,600 చెల్లిస్తారు. రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఉంటుంది.
READ ALSO : Donkey Farm : గాడిదల ఫాం తో లక్షల్లో అదాయం పొందుతున్న యువరైతు !
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదిగా ఏప్రిల్ 19, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://cochinshipyard.in/ పరిశీలించగలరు.