SVIMS Tirupati Recruitment
SVIMS Tirupati Recruitment : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 76, అసోసియేట్ ప్రొఫెసర్లు: 20 , ప్రొఫెసర్లు ;4 పోస్టులు ఉన్నాయి.
READ ALSO : CCI Recruitment : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఫీల్డ్ స్టాఫ్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అయా విభాగాల్లో ఎండీ లేదా ఎంఎస్ లేదా డీఎన్‌బీతో పాటు నిర్ణీత పని అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి ప్రొఫెసర్ పోస్టుకు 58 సంవత్సరాలు మించకూడదు. అసోసియేట్ ప్రొఫెసర్ /అసిస్టెంట్ ప్రొఫెసర్ 50 సంవత్సరాలు మించరాదు. దరఖాస్తు ఫీజుగా ఓసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, బీసీ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. చెల్లించాల్సి ఉంటుంది.
READ ALSO : Winter Immune Boosting : చలికాలంలో ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా రోగనిరోధకశక్తిని పెంచే ఆహారాలు !
దరఖాస్తు విధానం విషయానికి వస్తే అభ్యర్థులు స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు 15.11.2023గా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; రిజిస్ట్రార్, శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) అలిపిరి రోడ్, తిరుపతి – 517 507, ఆంధ్రప్రదేశ్. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://svimstpt.ap.nic.in/ పరిశీలించగలరు.