Winter Immune Boosting : చలికాలంలో ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా రోగనిరోధకశక్తిని పెంచే ఆహారాలు !

చలికాలంలో తేనె తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి చలికాలంలో దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. జలుబు, దగ్గు చికిత్సకు తేనెను వందల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు.

Winter Immune Boosting : చలికాలంలో ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా రోగనిరోధకశక్తిని పెంచే ఆహారాలు !

Winter Immune Boosting

Winter Immune Boosting : శీతాకాలంలో శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు అందరిని ఇబ్బంది పెడతాయి. అలాంటప్పుడు తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉండటం ఉత్తమం. ధూమపానం మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించడం, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తినడం వంటి జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవచ్చు.

READ ALSO : Microbial Insecticides : రైతు స్థాయిలో సూక్ష్మ జీవన క్రిమి సంహారాల తయారీ

చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందించటంలో కొన్ని రకాల ఆహారాలు ఎంతగానో సహాయపడతాయి. చలికాలంలో జలుబు,దగ్గు వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునే ప్రయత్నం చేయటం ద్వారా కొంతమేర ఈ వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చు. శరీరానికి వెచ్చదనాన్ని కలిగించే టీ, కాఫీ, హాట్ చాక్లెట్, సూప్ వంటి వేడి పదార్థాలను తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.

చలికాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ;

నెయ్యి ; చలికాలంలో నెయ్యి తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. నెయ్యితో రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను దరిచేరనివ్వదు. ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని పాలలో 3 స్పూన్ల నెయ్యిని కలుపుకుని తీసుకోవటం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. నీరసంగా, అలసట వంటి వాటి నుండి బయటపడవచ్చు. వేడివేడి అన్నంలో దీనిని వేసుకుని తినవచ్చు. అలాగని అధిక మోతాదులో దీనిని తీసుకోరాదు.

READ ALSO : Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..

బెల్లం; చలినుండి శరీరానికి వెచ్చదనం కావాలంటే బెల్లం తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. ప్రధానంగా ఐరన్ సంవృద్ధిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించటంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుచటంలో సహాయపడుతుంది. సాధారణంగా చలికాలంలో జీవక్రియలు మందకొడిగా ఉంటాయి. వాటిని వేగవంతం చేయటం లో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరిచి జలుబు, దగ్గు సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. బెల్లం రోజూ కొద్ది మొత్తంలో తీసుకోవటం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

READ ALSO : Daily salt intake : ఆహారంలో ఉప్పు వినియోగం అధికమైతే అనర్ధాలు తప్పవా ?

సిట్రస్ పండ్లు ; ఆరెంజ్, యాపిల్, దానిమ్మ, కివి, బొప్పాయి, జామ మొదలైన పండ్లను తీసుకోవటం చాలా మంచిది. శీతాకాలంలో ఈ పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. వీటిని తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలగటంతోపాటుగా రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. సిట్రస్ జాతికి చెందిన పండ్లు చల్లని వాతావరణంలో జలుబు, దగ్గు వంటి వాటి నుండి రక్షణగా పనిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచుతాయి.

READ ALSO : Diet For Dengue : డెంగ్యూ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు

తేనె ; చలికాలంలో తేనె తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి చలికాలంలో దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. జలుబు, దగ్గు చికిత్సకు తేనెను వందల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఊపిరితిత్తులు, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేడి నీటిలో తేనెను కలిపి తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే టాక్సిన్స్ ను బయటకు పంపవచ్చు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గొంతు నొప్పి , దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే నిమ్మకాయనీటిలో తేనె కలుపుకుని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

READ ALSO : Vitamin D3 : విటమిన్ D3 ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది? విటమిన్ D3 పొందేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు !

అల్లం ; చలికాలంలో అల్లం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో యాంటి బ్యాక్టిరియల్ గుణాలు ఉన్నాయి. జలుబు, దగ్గు వంటి ఇన్షెక్షన్ల నుండి రక్షించటంలో సహాయపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ పెరగటాన్ని నిరోధిస్తుంది.