CCI Recruitment : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఫీల్డ్ స్టాఫ్ పోస్టుల భర్తీ

పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించరాదు.

Recruitment

CCI Recruitment : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుంటూరు కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన ఫీల్డ్ ఆఫీస్‌ స్టాఫ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఫీల్డ్ స్టాఫ్, ఆఫీస్‌ స్టాఫ్‌(అకౌంట్స్‌), ఆఫీస్‌ స్టాఫ్‌(జనరల్) తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

READ ALSO : Viral : బీరు తయారీ పరిశ్రమ ట్యాంకులో మూత్ర విసర్జన…కంపెనీ దర్యాప్తు ప్రారంభం

పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించరాదు. అభ్యర్ధుల ఎంపికకకు సంబంధించి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు నెలకు ఆఫీస్‌ స్టాఫ్‌కు రూ.24,000. ఫీల్డ్ స్టాఫ్‌కు రూ.36,000 చెల్లిస్తారు.

READ ALSO : Alaska Airlines : గాల్లో దూసుకుపోతున్న విమానం ఇంజన్ ఆపటానికి యత్నించిన పైలట్ ..

నవంబరు 2,3 వ తేదీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ లను నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పంపాల్సిన చిరునామా ; కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , కపాస్ భవన్, 4/2 అశోక్ నగర్, P.B. నం:227, గుంటూరు-522002, ఆంధ్రప్రదేశ్. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://cotcorp.org.in/ పరిశీలించగలరు.