Viral : బీరు తయారీ పరిశ్రమ ట్యాంకులో మూత్ర విసర్జన…కంపెనీ దర్యాప్తు ప్రారంభం

ఓ బీరు కంపెనీలోని ట్యాంకులో సాక్షాత్తూ ఓ ఉద్యోగి మూత్ర విసర్జన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చైనా దేశంలోని ప్రముఖ బీరు తయారీ పరిశ్రమ సింగ్టావో దర్యాప్తు ప్రారంభించారు. వీడియో తీసిన వ్యక్తి, అందులో కనిపిస్తున్న వ్యక్తి ఇద్దరూ కంపెనీ ఉద్యోగులేనని వెల్లడైంది.....

Viral : బీరు తయారీ పరిశ్రమ ట్యాంకులో మూత్ర విసర్జన…కంపెనీ దర్యాప్తు ప్రారంభం

Chinese Beer Maker Tsingtao

Viral : ఓ బీరు కంపెనీలోని ట్యాంకులో సాక్షాత్తూ ఓ ఉద్యోగి మూత్ర విసర్జన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చైనా దేశంలోని ప్రముఖ బీరు తయారీ పరిశ్రమ సింగ్టావో దర్యాప్తు ప్రారంభించారు. వీడియో తీసిన వ్యక్తి, అందులో కనిపిస్తున్న వ్యక్తి ఇద్దరూ కంపెనీ ఉద్యోగులేనని వెల్లడైంది. చైనాలోని ఒక అగ్రశ్రేణి బీర్ ఫ్యాక్టరీ ఉద్యోగి పదార్ధాల కంటైనర్‌లో మూత్ర విసర్జన చేస్తున్నట్లు చూపించే వైరల్ వీడియో వెలుగుచూసింది.

Also Read :  Girlfriend : గర్భం దాల్చిన గర్ల్‌ఫ్రెండ్…డాక్టర్ ప్రియుడు ఏం చేశాడంటే…

క్లిప్, హెల్మెట్, యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి ఎత్తైన గోడపైకి ఎక్కి కంటైనర్‌లోకి మూత్ర విసర్జన చేసినట్లు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో బయటపడింది. సింగ్‌టావో బ్రూవరీ గోదాములో ఈ ఘటన జరిగింది. ఈ ఫుటేజ్ ఆన్‌లైన్‌లో మిలియన్ల మంది వీక్షించారు. దీంతో కంపెనీ వెంటనే పోలీసులను అప్రమత్తం చేసింది. మూత్రం పోసిన బీరు బ్యాచ్ పదార్థాలను సీలు చేసింది. సింగ్టావో చైనా యొక్క అగ్ర బీర్ ఉత్పత్తిదారులలో ఒకటి. అతిపెద్ద ఎగుమతిదారు.

Also Read : Hamoon Cyclone : హమూన్ తుపాన్ ఎఫెక్ట్…పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

ఈ సంఘటనపై పోలీసులను సంప్రదించామని, దర్యాప్తు కొనసాగుతోందని కంపెనీ తెలిపింది. ఈ ఘటనతో సింగ్ టావో షేరు ధర పతనమైంది. సోమవారం ఉదయం షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైనప్పుడు కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి. అయితే మధ్యాహ్నం వరకు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయని అవుట్‌లెట్ నివేదించింది. చైనా బీరు కంపెనీ బ్రాండ్ కు తీరని నష్టం జరిగిందని చైనా వాసులు చెప్పారు.