Hamoon Cyclone : హమూన్ తుపాన్ ఎఫెక్ట్…పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

హమూన్ తుపాన్ తీవ్రరూపం దాల్చడంతో మంగళవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో హమూన్ తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది....

Hamoon Cyclone : హమూన్ తుపాన్ ఎఫెక్ట్…పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

Hamoon Cyclone

Hamoon Cyclone : హమూన్ తుపాన్ తీవ్రరూపం దాల్చడంతో మంగళవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో హమూన్ తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ఈ తుపాన్ ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ అంచనా సంస్థ నివేదించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం తుపాను అక్టోబరు 25వతేదీ మధ్యాహ్నం బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య తీరాన్ని తాకనుంది.ఈ తుపానుకు ఇరాన్ దేశం హమూన్ అని పేరు పెట్టింది.

Also Read : Earthquake : ఖట్మండులో మళ్లీ భూకంపం…తీవ్రత ఎంతంటే…

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వల్ల ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, దక్షిణ అస్సాంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 24న మిజోరంలో భారీ వర్షాలు కురుస్తాయని, త్రిపురలో అంతకంటే భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. అక్టోబరు 25వతేదీన ఈ ప్రాంతాల్లో భారీ వర్షాల ప్రమాదం ఉంది.

Also Read : Hamas releases : హమాస్ సంచలన నిర్ణయం…మానవతా దృక్పథంతో ఇద్దరు ఇజ్రాయెలీ బందీల విడుదల

అయితే అక్టోబర్ 26వతేదీ నాటికి తుపాన్ తీవ్రత తగ్గుతుందని అంచనా వేశారు. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయలో కూడా అక్టోబర్ 24-25 తేదీలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. దక్షిణ అస్సాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబరు 24న చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Also Read : Durga Puja pandal : దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట…ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

దీంతో ఒడిశా తీరప్రాంత జిల్లాలు హమూన్ ప్రభావం బారిన పడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లోని కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. అక్టోబరు 24న చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సైక్లోనిక్ హమూన్ ప్రభావం వల్ల బంగాళాఖాతం, తూర్పు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో బలమైన గాలులు వీస్తున్నాయి.

Also Read : Kangana Ranaut : ఢిల్లీలో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయబోయే తొలి సెలిబ్రిటీ ఎవరంటే…

ఒడిశా తీరం వెంబడి అక్టోబర్ 24 వరకు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలులు అక్టోబర్ 24 ఉదయం నుంచి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్,ఉత్తర మయన్మార్ తీరాల వెంబడి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 25వతేదీన మిజోరం, త్రిపుర, దక్షిణ అస్సాం, మణిపూర్ లలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.