NABARD : నాబార్డ్ లో గ్రేడ్ ఏ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. పోస్టుల ఆధారంగా అభ్యర్ధుల వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

NABARD : నాబార్డ్ లో గ్రేడ్ ఏ పోస్టుల భర్తీ

Nabard (1)

Updated On : July 21, 2022 / 5:36 PM IST

NABARD : నాబార్డ్‌ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఉన్న గ్రేడ్‌ ఏ అసిస్టెంట్‌ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 170 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ ఇన్‌ గ్రేడ్‌ ఏ (ఆర్‌డీబీఎస్‌)161 ఖాళీలు, అసిస్టెంట్‌ మేనేజర్ ఇన్‌ గ్రేడ్‌ ఏ (రాజ్‌భాష సర్వీస్‌)7 ఖాళీలు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఇన్‌ గ్రేడ్‌ ఏ (ప్రొటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌)2 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. పోస్టుల ఆధారంగా అభ్యర్ధుల వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 28,150 నుంచి రూ. 55,600 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న నాబార్డ్‌ కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదిగా ఆగస్టు 7, 2022 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nabard.org/careers పరిశీలించగలరు