Textiles Ministry
Job Vacancies : టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్నపోస్టుల్లో జూనియర్ వీవర్, సీనియర్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్ (వీవింగ్), జూనియర్ అసిస్టెంట్(ప్రాసెసింగ్), అటెండెంట్ (వీవింగ్) , అటెండెంట్ (ప్రాసెసింగ్) పోస్టులు ఉన్నాయి.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 23గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; texmin.nic.in
పరిశీలించగలరు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : ‘ డైరెక్టర్, వీవర్స్ సర్వీస్ సెంటర్, B-2 వీవర్స్ కాలనీ, భరత్ నగర్, ఢిల్లీ 110 052