Outsourcing Jobs : కామారెడ్డి జిల్లా లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్,బీఏఎంస్,బీఎస్సీ నర్సింగ్,జీఎన్‌ఎంలో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Recruitment of mid level health provider posts in Kamareddy district
Outsourcing Jobs : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కామారెడ్డి జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేషనల్ హెల్త్ మిషన్ కింద పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 81 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు, ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్,బీఏఎంస్,బీఎస్సీ నర్సింగ్,జీఎన్‌ఎంలో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్,జీఎన్‌ఎం అభ్యర్ధులు ఖచ్చితంగా 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం పూర్తిచేసి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 17, 2022వ తేదీలోపు దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మెరిట్ లిస్ట్ అక్టోబర్ 3, 2022వ తేదీన విడుదల చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.29,900ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : జిల్లా వైద్య & ఆరోగ్య కార్యాలయం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://kamareddy.telangana.gov.in/ పరిశీలించగలరు.