JOBS : ఎన్ సీఈఆర్ టీలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తోపాటుగా సాఫ్ట్ వేర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

Jobs (1)

JOBS : భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎన్ సీఈ ఆర్ టీ సెల్ ఫర్ నేషనల్ సెంటర్ ఫర్ లిటరసీ లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో డిజిటల్ కంటెంట్ డెవలపర్లు 2 పోస్టులు, గ్రాఫీక్ ఆర్టిస్టులు 2 పోస్టులు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తోపాటుగా సాఫ్ట్ వేర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. వయస్సు 40 ఏళ్లు లోపు ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేది ఆగస్టు 1, 2022, ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిన చిరునామా ; రూమ్ నెం. 246, రెండో అంతస్తు, సీఐఈటీ, ఎన్ సీఈఆర్ టీ, శ్రీ అరబిందో మార్గ్, న్యూ దిల్లీ 110016, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ncert.nic.in/ పరిశీలించగలరు.