NHB Recruitment : నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీ

ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, సీఎఫ్ ఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులను అబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

NHB Recruitment : నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీ

Recruitment of posts on contract basis in National Housing Bank

Updated On : October 26, 2022 / 5:06 PM IST

NHB Recruitment : న్యూదిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ( ఎన్ హెచ్ బీ) లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 పోస్టులను ఒప్పంద, రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. పోస్టుల ఖాళీలకు సంబంధించి చీఫ్ ఎకనామిస్ట్ 1 ఖాళీ, ప్రొటోకాల్ ఆఫీసర్ 2 ఖాళీలు, డిప్యూటీ జనరల్ మేనేజర్ 1ఖాళీ, అసిస్టెంట్ మేనేజర్ జనరల్ మరియు హిందీ 16 పోస్టులు, ఆఫీసర్ సూపర్ విజన్ 6 ఖాళీలు, రీజినల్ మేనేజర్ కంపెనీ సెక్రెటరీ 1 ఖాళీ ఉన్నాయి.

ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, సీఎఫ్ ఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులను అబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబరు 18, 2022ను ఆఖరు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nhb.org.in పరిశీలించగలరు.