Kharagpur IIT : ఖరగ్ పూర్ ఐఐటీలో ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బ్యాచిలర్‌ డిగ్రీ,మాస్టర్స్‌ డిగ్రీ,ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఏ, బీఏ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఎస్, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి.

Kharagpur Iit

Kharagpur IIT : పశ్చిమ బెంగాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఖరగ్‌పూర్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏఐ4ఐసీపీఎస్‌ ఐ హబ్‌ ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేపట్టనున్నారు. మొత్తం పోస్టుల ఖాళీలు15 ఉన్నాయి. ఖాళీల వివరాలకు సంబంధించి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌1, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌1, చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌1, ప్రోగ్రామ్‌ మేనేజర్‌2, ఇంజనీరింగ్‌ మేనేజర్‌2, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌6, లీగల్‌ అసోసియేట్‌1, హెచ్‌ఆర్‌ కమ్యూనికేషన్‌ ఎగ్జిక్యూటివ్1 ఖాళీ ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బ్యాచిలర్‌ డిగ్రీ,మాస్టర్స్‌ డిగ్రీ,ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఏ, బీఏ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఎస్, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి అర్హత, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఆఖరు తేదీగా 31జులై 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ai4icps.in/పరిశీలించగలరు.