C-DOT Recruitment : సీడాట్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ లో సాధించిన మార్కులు, బీఈ, బీటెక్, బీడిజైన్ తోపాటు, పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి గరిష్ట వయసు సడలింపు ఉంటుంది.

Recruitment of project engineer
C-DOT Recruitment : భారత టెలికాం టెక్నాలజీ సెంటర్ కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 156 ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయనుంది. న్యూదిల్లీ, బెంగుళూరు కేంద్రాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నిమాయకాలు ఏడాది కాలానికి మాత్రమే పరిమితం అభ్యర్ధి పనితీరును పరిగణలోకి తీసుకుని మరో ఏడాది కాలం పొడిగిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ లో సాధించిన మార్కులు, బీఈ, బీటెక్, బీడిజైన్ తోపాటు, పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి గరిష్ట వయసు సడలింపు ఉంటుంది.
READ ALSO : Easiest Ways To Sneeze : తుమ్మేందుకు ప్రయత్నిస్తున్నా తుమ్మురావటంలేదా? తుమ్మడానికి సులభమైన మార్గాల ఇవే !
స్ర్కీనింగ్ ప్రక్రియ ద్వారా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటే షార్ట్ లిస్ట్ తయారు చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నెలకు కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ క్రింద నెలకు లక్ష వేతనంగా చెల్లిస్తారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదిగా 29 నవంబర్ 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.cdot.in పరిశీలించగలరు.