IISER Tirupati
IISER Tirupati : తిరుపతిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ లో పలు విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Important Healthy Foods : శరీరానికి పోషణనిచ్చే ముఖ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే !
బలయాజీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ , మ్యాథమెటిక్స్ , ఫిజిక్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రొఫెసర్ పోస్టులు 7, అసిస్టెంట్ ప్రొఫెసర్ 25 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్ డీతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్ అధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ప్రారంభ వేతనంగా ప్రొఫెసర్ కు 1, 59,100, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు 1,01,500 చెల్లిస్తారు.
READ ALSO : Turmeric Cultivation : ఖరీఫ్ కు అనువైన పసుపు రకాలు.. అధిక దిగుబడులు పొందేందుకు మెళకువలు
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు 7 జులై 2023 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ ; https://www.iisertirupati.ac.in/ పరిశీలించగలరు.