Nainital Bank Recruitment : నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ లో ట్రైనీ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్‌పై అవగాహన ఉండాలి.

Nainital Bank Recruitment :
Nainital Bank Recruitment : భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, హరియాణా, రాజస్థాన్‌లోని ఎన్‌బీఎల్ శాఖల్లో పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్‌పై అవగాహన ఉండాలి. బ్యాంకింగ్/ఫైనాన్షియల్/ఇన్‌స్టిట్యూషన్స్/ఎన్‌బీఎఫ్‌సీలలో 1 నుంచి 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష నవంబర్ 13వ తేదీన నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.36,000ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.
అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nainitalbank.co.in/ పరిశీలించగలరు.