Chennai Metro : చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ లో పలు పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 2-7 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 30-38 సంవత్సరాలు ఉండాలి.

Chennai Metro

Chennai Metro : చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 మేనేజర్ పోస్టు ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిప్యూటేషన్,ఒప్పంద ప్రాతిపదికన వీటిని భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : TS DME Recruitment : తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో టీచింగ్ పోస్టుల భర్తీ

విభాగాల వారిగా ఖాళీలను పరిశీలిస్తే డిప్యూటీ జనరల్ మేనేజర్(ఎలక్ట్రికల్ & మెకానికల్) 02, మేనేజర్(ఎలక్ట్రికల్ & మెకానికల్) 03, మేనేజర్(ఎన్విరాన్‌మెంట్) 1, డిప్యూటీ మేనేజర్(ఎలక్ట్రికల్ & మెకానికల్)1, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ & మెకానికల్) 1, అసిస్టెంట్ మేనేజర్ (ఎన్విరాన్‌మెంట్)1 ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : MS Dhoni : దొంగచాటుగా ధోని వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్.. ఫ్యాన్స్ ఫైర్‌.. ఇలా చేయ‌డం ఏం బాలేదు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 2-7 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 30-38 సంవత్సరాలు ఉండాలి.

READ ALSO : Uttar Pradesh: దివ్యాంగుడి మీద ఇద్దరు జవాన్ల జులుం.. నీళ్లు అడిగినందుకు కిరాతకంగా కొట్టారు

ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.60000-రూ.80000 చెల్లిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హార్డు కాపీలను అదనపు జనరల్ మేనేజర్ (HR), చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్, మెట్రోస్,అన్నా సలై, నందనం, చెన్నై – 600 035. చిరునామాకి పంపాలి.

READ ALSO : Brahmanandam : కుమారుడి పెళ్లికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన బ్రహ్మానందం

దరఖాస్తుకు చివరి తేదిగా 28.08.2023 నిర్ణయించారు. హార్డు కాపీలను ఆగస్టు 28 వరకు పంపవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://chennaimetrorail.org/ పరిశీలించగలరు.