MNNIT JOBS : ఎమ్ ఎన్ఎన్ఐటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
అభ్యర్ధుల వయస్సు 60 ఏళ్లకు మించరాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్ లో పీహెచ్ డీ లేదంటే తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

Beautiful Young And Green Leaves In The Sun
MNNIT JOBS : భారత ప్రభుత్వ రంగానికి చెందిన అలహాబాద్ లోని మోతీలాల్ నెహ్రు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 145 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అప్లైడ్ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మేనేజ్ మెంట్ స్టడీస్ తదితర సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల వయస్సు 60 ఏళ్లకు మించరాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్ లో పీహెచ్ డీ లేదంటే తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అయా సబ్జెక్టుల్లో టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు పంపాల్సిన చిరునామా ; రిజిస్ట్రార్, ఎంఎన్ఎన్ ఐటీ అలహాబాద్, ప్రయాగ్ రాజ్ 211004, యూపీ, ఇండియా, దరఖాస్తులకు చివరి తేదిగా జూన్ 30, 2022గా నిర్ణయించారు. ఆఫ్ లైన్ దరఖాస్తులకు జులై 7, 2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.mnnit.ac.in/పరిశీలించగలరు.