BIS JOBS : బీఐఎస్ లో ఒప్పంద ఉద్యోగాల భర్తీ
ఆయా పోస్టులను అనుసరించి కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ మెటలర్జికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

Bis Jobs
BIS JOBS : భారత ప్రభుత్వ వినియోగదారులు వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్( బీఐఎస్) లో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 ఉద్యోగ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తారు. విభాగాల వారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే స్టాండర్డైజేషన్ విభాగంలో 4 పోస్టులు, రిసెర్చ్ అనాలసిస్ విభాగంలో 20 పోస్టులు, మేనేజ్ మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ విభాగంలో 22 పోస్టులు ఉన్నాయి.
ఆయా పోస్టులను అనుసరించి కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ మెటలర్జికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 35 ఏళ్లకు మించరాదు. విద్యార్హతలు, అనుభవం అధారంగా అభ్యర్ధుల్ని తొలుత షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ప్రాక్టికల్ అసెస్ మెంట్, రిటన్ అసెస్ మెంట్ , టెక్నికల్ నాలెడ్జ్ అసెస్ మెంట్ , ఇంటర్య్వూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు ఆఖరుతేదిగా జులై 15, 2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు