Bis Jobs : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో పోస్టుల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఆన్ లైన్ పరీక్ష , స్కిల్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. అర్హత విషయానికి వస్తే అభ్యర్ధులు గుర్తింపు పొందిన సంస్ధ నుండి ఏదైనా డిగ్రీ, తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

Bis Jobs : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో పోస్టుల భర్తీ

Bis

Updated On : May 2, 2022 / 2:14 PM IST

Bis Jobs : కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్ ) లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ ఏ, బి, సిల వారిగా పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలను పరిశీలిస్తే

గ్రూప్ ఏ పోస్టులు ; డైరెక్టర్ లీగర్ 1ఖాళీ, అసిస్టెంట్ డైరెక్టర్ హిందీ 1 ఖాళీ , అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిన్ అండ్ ఫైనాన్స్ 1 ఖాళీ, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ 1 ఖాళీ ఉన్నాయి.

గ్రూప్ బి పోస్టులు ; పర్సనల్ అసిస్టెంట్ 28 ఖాళీలు, అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ 2 ఖాళీలు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 47 ఖాళీలు, టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ 47 ఖాళీలు, మెకానికల్ 19 ఖాళీలు, కెమికల్ 18 ఖాళీలు, మైక్రోబయాలజీ 10 ఖాళీలు ఉన్నాయి.

గ్రూప్ సి పోస్టులు ; స్టెనోగ్రాఫర్ 22 ఖాళీలు, సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 100 ఖాళీలు, హార్టికల్చర్ సూపర్ వైజర్ 1ఖాళీ, సీనియర్ టెక్నీషియన్ 25 ఖాళీలు, కార్పెంటర్ 6 ఖాళీలు ,వెల్డర్ 2 ఖాళీలు, ప్లంబర్ 3 ఖాళీలు, ఫిట్టర్ 3 ఖాళీలు, టర్నర్ 5ఖాళీలు, ఎలక్ట్రిషియన్ 6ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఆన్ లైన్ పరీక్ష , స్కిల్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. అర్హత విషయానికి వస్తే అభ్యర్ధులు గుర్తింపు పొందిన సంస్ధ నుండి ఏదైనా డిగ్రీ, తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఆయా పోస్టులను అనుసరించి ప్రత్యేక అర్హతలు కలిగి ఉండాలి. దరఖాస్తు ఫీజు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు 800, ఇతర పోస్టులకు 500గా నిర్ణయించారు. దరఖాస్తుల సీకరణకు చివరి తేది మే 9, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.bis.gov.in పరిశీలించగలరు.