Csir Nio
CSIR-NIO : గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ) లో సైంటిఫిక్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగాల్లో పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ , ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 23,2022 నుండి ప్రారంభం కానుంది.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 30, 2022గా నిర్ణయించారు. ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణకు మే 16, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;www.nio.org/సంప్రదించాలి.