JOBS : కడప డెంటల్ కాలేజ్ లో పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. అర్హతల విషయానికి వస్తే ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్, ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో అందజేయాల్సి ఉంటుంది.

Kadapa Dental College

JOBS : ఆంధ్రప్రదేశ్ లోని కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి డెంటల్ హైజీనిస్ట్ 5 ఖాళీలు, డెంటల్ టెక్నీషియన్ 5 ఖాళీలు, వైర్ మ్యాన్, ఎలక్ట్రీషియన్ 4 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. అర్హతల విషయానికి వస్తే ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్, ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల అందజేయాల్సిన చిరునామా ; ప్రిన్సిపాల్, ప్రభుత్వ దంత వైద్య కళాశాల, కడప, దరఖాస్తులకు చివరి తేది 20 జూన్ , 2022గా నిర్ణయించారు.