Jobs
JOBS : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మేడ్చల్,మల్కాజ్ గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి
మెడికల్ ఆఫీసర్లు 18 ఖాళీలు ఉన్నాయి. అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటుగా, టీఎస్,ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టరై ఉండాలి. వయస్సు 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి. స్టాఫ్ నర్సు ఖాళీలు 18 ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ జీఎన్ ఎం ఉత్తీర్ణతతోపాటు, టీఎస్, ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టరై ఉండాలి. వయస్సు 18 సంవత్సరాల నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా 500 రూ చెల్లించాలి. దరఖాస్తులకు చివరి తేది జూన్ 6, 2022గా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; డీఎంహెచ్ ఓ, బీ బ్లాక్, మొదటి అంతస్తు, కలెక్టర్ కాంప్లెక్స్, కీసర, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా.