JOBS : ఇండియన్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

దరఖాస్తు ఫీజుగా ఇతరులు 850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులు 175 చెల్లించాలి. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది 14 జూన్, 2022గా నిర్ణయించారు.

Indian Bank

JOBS : చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంకు ఇండియన్ బ్యాంకు వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 312 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో సీనియర్ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, చీఫ్ మేనేజర్ల పోస్టులు ఉన్నాయి. క్రెడిట్, అకౌంట్స్, రిస్క్ మేనేజ్ మెంట్, డేటా అనలిస్ట్, ఐటీ, డిజిటల్, బ్యాంకింగ్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 23 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజుగా ఇతరులు 850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులు 175 చెల్లించాలి. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది 14 జూన్, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://www.indianbank.in పరిశీలించగలరు.