Apprentice Recruitment
Central Railway Recruitment : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), సెంట్రల్ రైల్వే, RRC సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2409 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కనీసం 50% మార్కులతో 10వ తరగతి పరీక్ష లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణతతోపాటుగా సంబంధిత ట్రేడ్‌లలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ITI) కలిగి ఉన్నారు అర్హులు. అభ్యర్ధుల కనీస వయస్సు 15 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 24 సంవత్సారాలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా సెప్టెంబరు 28, 2023ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; rrccr.com పరిశీలించగలరు.