SAIL Recruitment 2023 : డిప్లొమా, ఐటిఐ అర్హతతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 110 పోస్టుల భర్తీ

ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టుకు జనరల్, ఈడబ్ల్యూఎస్ & ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మరియు ప్రాసెసింగ్ ఫీజు రూ.500 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ, డిపార్ట్‌మెంటల్,ఈఎస్ఎం అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.150. చెల్లించాలి.

SAIL Recruitment 2023

SAIL Recruitment 2023 : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)రూర్కెలాలో ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (Operator-cum-Technician), అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (Attendant-cum-Technician) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

READ ALSO : Ankita : భర్తను చెప్పుతో కొట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. భర్త వేరే కంటెస్టెంట్‌తో..

మొత్తం ఖాళీలు: 110 ఉన్నాయి.

1. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్: 30 ఖాళీలు ఉన్నాయి. బాయిలర్ ఆపరేటర్, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

వయోపరిమితి:

బాయిలర్ ఆపరేటర్ విభాగంలో 18-30, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ విభాగంలో 18-28 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హత:

మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత విభాగాలలో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

READ ALSO : IRCTC Down : ఐఆర్‌సీటీసీలో సాంకేతిక లోపం.. స్తంభించిన సర్వీసులు.. యూజర్ల ఫిర్యాదులు!

2. అటెండెంట్-కమ్-టెక్నీషియన్(ట్రైనీ): 80 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, CoPA/ఐటీ తదితర విభాగాల్లో ఈఖాళీలు ఉన్నాయి.

అర్హత:

10వ తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి:

18-28 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

READ ALSO : Pawan Kalyan : సనాతన ధర్మం, సోషలిజం రెండు కలిసి నడిచేదే జనసేన : పవన్ కల్యాణ్

దరఖాస్తు ఫీజు:

ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టుకు జనరల్, ఈడబ్ల్యూఎస్ & ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మరియు ప్రాసెసింగ్ ఫీజు రూ.500 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ, డిపార్ట్‌మెంటల్,ఈఎస్ఎం అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.150. చెల్లించాలి.

అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టుకు జనరల్, ఈడబ్ల్యూఎస్ ,ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు+ ప్రాసెసింగ్ ఫీజు రూ.300. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ, డిపార్ట్‌మెంటల్,ఈఎస్ఎం అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ, డిపార్ట్‌మెంటల్,ఈఎస్ఎం అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

READ ALSO : గూగుల్ పే యూజర్లకు వార్నింగ్.. ఈ యాప్స్ యమ డేంజర్

ఎంపిక విధానం:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం:

CBTలో 2 విభాగాలలో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

READ ALSO : Telangana Assembly Election 2023 : తెలంగాణలో చోటామోటా నేతల కొనుగోలుకు అభ్యర్థుల వ్యూహాలు

జీతం/స్టైపెండ్:

ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టులకు Rs.26600-3%-రూ.38,920 చెల్లిస్తారు. అటెండెంట్-కమ్-టెక్నీషియన్(ట్రైనీ) పోస్టులకు రూ.25,070-3%-రూ.35,070 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Nara Lokesh : నవంబర్ 27నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభం

దరఖాస్తు ప్రక్రియ:

స్టెప్ 1 ; వెబ్‌సైట్ www.sail.co.in ఓపెన్ చేయాలి.

స్టెప్ 2 ; కెరీర్స్ పేజిలోకి వెళ్లి నోటిఫికేషన్‌ను ఓపెన్ చేసి జాగ్రత్తగా చదవాలి.

స్టెప్ 3 ; సైట్‌లో అందుబాటులో ఉన్న యూజర్ మాన్యువల్ ద్వారా Login పై క్లిక్ చేయండి.

స్టెప్ 4 ; కొత్త యూజర్ అయితే ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసి, ఆపై యూజర్ ID & పాస్‌వర్డ్ క్రియేట్ చేయాలి.

స్టెప్ 5 ; తరువాత ID & పాస్‌వర్డ్ ఉపయోగించి “రిజిస్టర్డ్ యూజర్” పై క్లిక్ చేయాలి.

స్టెప్ 6 ;అవసరమైన సమాచారాన్ని పూరించాలి. అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. ఫీజు చెల్లింపు గేట్‌వే చేయాలి. చివరిగా సబ్ మిట్ చేయాలి.

READ ALSO : Indrakiladri : భవానీ మండల దీక్షతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 20.11.2023 నుండి ప్రారంభమైంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ 16.12.2023 గా నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు