SAIL Recruitment 2025 : సెయిల్‌లో జాబ్స్ పడ్డాయి.. ఇంటర్వ్యూ మాత్రమే.. నెలకు రూ.2.5 లక్షల వరకు జీతం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

SAIL Recruitment 2025 :  స్పెషలిస్ట్ డాక్టర్ల కోసం సెయిల్ వివిధ విభాగాలలో దరఖాస్తులను  ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

SAIL Recruitment 2025 : సెయిల్‌లో జాబ్స్ పడ్డాయి.. ఇంటర్వ్యూ మాత్రమే.. నెలకు రూ.2.5 లక్షల వరకు జీతం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

SAIL Recruitment 2025

Updated On : February 13, 2025 / 8:41 PM IST

SAIL Recruitment 2025 : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇదో సువర్ణావకాశం. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ (DSP)లోని వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ డాక్టర్ల కోసం సెయిల్ దరఖాస్తులను ఆహ్వానించింది.

Read Also : iPhone 16 Plus : ఆపిల్ ఫోన్ కావాలా? ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.11వేలకు పైగా డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు (sail.co.in) అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేస్తారు. మీరు ఈ పోస్టులలో పనిచేయాలనుకుంటే ఫిబ్రవరి 21న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ కింది పోస్టులకు ఖాళీలను కలిగి ఉంది. జీడీఎంఓ 6 ఖాళీలు, స్పెషలిస్టు (బర్న్), స్పెషలిస్టు ( సర్జరీ), స్పెషలిస్టు (పీడియాట్రిక్స్), స్పెషలిస్టు (పబ్లిక్ హెల్త్), స్పెషలిస్టు (చెస్ట్), స్పెషలిస్టు ( రేడియాలజీ) వంటి విభాగాల్లో కలిపి మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి.

జీడీఎంఓ                                 6
స్పెషలిస్ట్ (బర్న్)                    1
స్పెషలిస్ట్ (సర్జరీ)                   1
స్పెషలిస్ట్ (పీడియాట్రిక్స్)    1
స్పెషలిస్ట్ (పబ్లిక్ హెల్త్)        1
స్పెషలిస్ట్ (చెస్ట్)                    1
స్పెషలిస్ట్ (రేడియాలజీ)     1

మొత్తం                                12

వయోపరిమితి, అర్హతలివే :
సెయిల్‌లో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఎంబీబీఎస్ డిగ్రీని కలిగి ఉండాలి, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ/ప్లాస్టిక్ అండ్ రీస్ట్రక్చర్ సర్జరీ డిగ్రీ కూడా అవసరం. ఇతర పోస్టులకు, సంబంధిత సబ్జెక్టులో పీజీ డిప్లొమా/డిగ్రీతో పాటు ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితిని 69 సంవత్సరాలుగా నిర్ణయించారు. అభ్యర్థుల వయస్సు ప్రకటన తేదీ 2025 ఫిబ్రవరి 6 నాటికి లెక్కిస్తారు.

Read Also : iPhone 16 Plus : ఆపిల్ ఫోన్ కావాలా? ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.11వేలకు పైగా డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

ఎంపిక ప్రక్రియ ఎలా :
సెయిల్ (SAIL) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారిని వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రతి రోజు గరిష్టంగా 60 మంది ప్రాథమికంగా పరీక్షించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైనవారు ఆయా ఖాళీల్లో ఉద్యోగ అవకాశాన్ని పొందవచ్చు.

ఎంపిక తర్వాత జీతం ఎంతంటే? :
ఈ నియామకంలో ఎంపికైన అభ్యర్థుల జీతం వారి పదవిని బట్టి రూ.90వేల నుంచి రూ.2,50,000 వరకు ఉంటుంది. అభ్యర్థుల బాధ్యతలను బట్టి జీతం మారవచ్చు.