SBI SCO Admit Cards : ఎస్బీఐ ఎస్‌సీఓ పోస్టులకు అడ్మిట్ కార్డులు విడుదల.. ఇంటర్వ్యూ షెడ్యూల్ పూర్తి వివరాలివే!

SBI SCO Admit Cards : అధికారిక ఎస్బీఐ వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా వారి అడ్మిట్ కార్డ్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఆపై డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

SBI SCO Admit Cards : ఎస్బీఐ ఎస్‌సీఓ పోస్టులకు అడ్మిట్ కార్డులు విడుదల.. ఇంటర్వ్యూ షెడ్యూల్ పూర్తి వివరాలివే!

Specialist Cadre Officers Interview

Updated On : January 11, 2025 / 8:46 PM IST

SBI SCO Admit Cards : ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ (SCO) రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూ కోసం అడ్మిట్ కార్డ్‌లను జారీ చేసింది. ఇంటర్వ్యూల కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ఇప్పుడు అధికారిక ఎస్బీఐ వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా వారి అడ్మిట్ కార్డ్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఆపై డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్‌లు 31 జనవరి 2025 వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

Read Also : Maha Kumbh 2025 : మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఛాయ్ వాలే బాబా’.. వాట్సాప్ ద్వారా అభ్యర్థులకు ఫ్రీగా ఐఏఎస్ కోచింగ్!

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ (SCO) రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ :

  • డిప్యూటీ మేనేజర్ పోస్ట్ : జనవరి 17, 2025
  • అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ : జనవరి 20, 2025

ఎస్బీఐ ఎస్‌సీఓ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలంటే? :

  • ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో, “Careers” లింక్‌ని ఎంచుకోండి.
  • “ఎస్బీఐ ఎస్‌సీఓ ఇంటర్వ్యూ అడ్మిట్ కార్డ్ 2024” కోసం లింక్‌ని క్లిక్ చేయండి.
  • కొత్త పేజీలో మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి. ఆపై సబ్మిట్ చేయండి.
  • మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • వివరాలను చెక్ చేయండి. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోండి.

డిప్యూటీ మేనేజర్ పోస్టుకు ఇంటర్వ్యూ వివరాలు :

Specialist Cadre Officers Interview

SBI SCO Admit Cards

  • ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి.
  • క్వాలిఫైయింగ్ మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది.
  • ఎస్బీఐ ద్వారా నిర్ణయించిన ప్రక్రియలో అనేక దశలు ఉండవచ్చు.

అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ :

  • ఆన్‌లైన్ రాత పరీక్షలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ అవుతారు.
  • ఇంటర్వ్యూకు 25 మార్కులు, అర్హత మార్కులను ఎస్బీఐ నిర్ణయించింది.
  • ఇంటరాక్షన్ కోసం అన్ని కేటగిరీల నుంచి తగినంత సంఖ్యలో అభ్యర్థులు ఆహ్వానిస్తారు.

రిక్రూట్‌మెంట్ డ్రైవ్ :
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సంస్థలో 1,497 పోస్టులను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎంపిక ప్రక్రియ గురించి మరింత సమాచారం కోసం, అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలని సూచించారు.

Read Also : Honda Elevate Black Editions : కొత్త కారు కొంటున్నారా? హోండా ఎలివేట్ సరికొత్త బ్లాక్ ఎడిషన్లు ఇవిగో.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?