School Fee Pay Apps : మీ పిల్లల స్కూల్ ఫీజు కట్టే యాప్స్.. మీరు తర్వాత EMIల్లో కట్టుకోవచ్చు.. ఓసారి లుక్కేయండి..!
School Fee Pay Apps : పేరెంట్స్.. పిల్లల స్కూల్ ఫీజు ఒకేసారి కట్టాలంటే కష్టమే మరి. ఆన్‌లైన్‌లో ఈ యాప్స్, ప్లాట్‌ఫారాల్లో సులభంగా ఈఎంఐలో చెల్లించవచ్చు. ఆర్బీఐ ఆమోదం పొందిన ఈ ప్లాట్‌ఫారమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

School Fee Pay Apps
School Fee Pay Apps : భారత్‌లో స్కూళ్లలో కొత్త అడ్మిషన్లు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లలో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఏదైనా స్కూళ్లలో అడ్మిషన్ కోసం ముందుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, చాలామంది ఆన్‌లైన్ ద్వారా స్కూల్ అడ్మిషన్ ఫీజులను పే చేస్తుంటారు.
ఒక్కసారిగా పెద్ద మొత్తంలో స్కూల్ ఫీజులు చెల్లించాలంటే కష్టమే. అందుకే చాలామంది తల్లిదండ్రులు స్కూళ్లు ఫీజులను ఇన్‌స్టాల్‌మెంట్ బేస్‌లో చెల్లిస్తుంటారు. ప్రస్తుతం స్కూల్ ఫీజులను చెల్లించేందుకు ఈఎంఐ ఆప్షన్లు అనేకం ఉన్నాయి. ప్రత్యేకించి స్కూల్ ఫీజులను చెల్లించేందుకు ఈఎంఐ ఆప్షన్లను అందించే అద్భుతమైన యాప్స్, అనేక ప్లాట్ ఫారమ్స్ చాలానే ఉన్నాయి.
ఈ సేవలను వివిధ ఆర్థిక సాంకేతిక సంస్థలు, విద్యా సంస్థలు అందిస్తున్నాయి. తల్లిదండ్రులకు స్కూల్ ఫీజుల భారాన్ని తగ్గించేందుకు ఈ యాప్స్ ఉపయోగపడతాయి. స్కూల్ ఫీజులను ఈఎంఐ రూపంలో చెల్లించేందుకు ఏయే యాప్స్, ప్లాట్‌ఫారంలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. క్రెడిట్ బీ (KreditBee) :
క్రెడిట్‌బీ అనేది ఒక పాపులర్ లెండింగ్ ప్లాట్‌ఫారం. తల్లిదండ్రులు స్కూల్ ఫీజులను ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు. అంతేకాదు.. స్వల్పకాలిక వ్యక్తిగత రుణాలను కూడా అందిస్తుంది. ఈ రుణాన్ని స్కూల్ ఫీజులను చెల్లించడం వంటి వివిధ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు.
ఈ ప్లాట్‌ఫామ్ సులభమైన ఈఎంఐ ఆప్షన్లను అందిస్తుంది. మీ బడ్జెట్ బట్టి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ క్రెడిట్‌బి యాప్ ఆర్బీఐ ఆమోదం పొందింది. NBFC సహకారంతో ఇది పనిచేస్తుంది. క్రెడిట్‌బీ అనేది బ్యాంకు లేదా NBFC కాదు. డిజిటల్ లోన్ల కోసం ఆర్బీఐ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తుంది.
2. జెస్ట్‌మనీ (ZestMoney) :
జెస్ట్‌మనీ అనేది ఈఎంఐ ఆప్షన్లను అందించే మరో ప్లాట్‌ఫామ్. స్కూల్ ఫీజులతో సహా వివిధ ప్రొడక్టులు, సర్వీసులకు వడ్డీ లేని ఈఎంఐలను అందిస్తుంది. తల్లిదండ్రులు ఈ యాప్ బై నౌ పే లేటర్ (BNPL) ఫీచర్‌ను ఉపయోగించి ఈఎంఐల ద్వారా స్కూల్ ఫీజులను చెల్లించవచ్చు. ఈ యాప్ కూడా ఆర్బీఐ ఆమోదం పొందింది. NBFCలతో పనిచేస్తుంది. డిజిటల్ రుణాలను అందించే ఈ ప్లాట్‌ఫారమ్ ఆర్బీఐ నియంత్రణలో ఒక భాగం. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది.
3. సింపల్ (Simpl) :
సింపల్ అనేది BNPL (Buy Now Pay Later) ప్లాట్‌ఫామ్.. తల్లిదండ్రలు తమ పిల్లల స్కూల్ ఫీజు చెల్లింపులను ఈజీ ఈఎంఐ ఆప్షన్లలో చెల్లించవచ్చు. తల్లిదండ్రులు సులభంగా వేగంగా చెల్లింపులు చేయవచ్చు. ఆ తరువాత ఈఎంఐ ఆప్షన్లుగా మార్చుకుని నెలవారీగా చెల్లించవచ్చు.
ఆర్బీఐ ఆమోదం పొందిన ఈ యాప్ డైరెక్ట్ ఫైనాన్షియల్ కంపెనీ కాదు. కానీ, ఆర్బీఐ నియంత్రణలో ఉన్న పార్టనర్ ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ డిజిటల్ పేమెంట్లు, BNPL స్కీమ్స్ కోసం ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తుంది.
4. ఎడ్యువాంజ్ (Eduvanz) :
ఎడ్యువాంజ్ అనేది ఎడ్యుకేషన్ లోన్లను అందించే ఆర్థిక సంస్థ. ఇందులో స్కూల్ ఫీజులను ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు. తల్లిదండ్రులు ఈఎంఐగా ఫీజులు చెల్లించడానికి లోన్ ఆప్షన్లను అందిస్తుంది. ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.
ఆర్బీఐ ఆమోదం పొందిన ఈ యాప్ ఆర్బీఐ రిజిస్టర్డ్ NBFCతో పనిచేస్తుంది. ఆర్బీఐ ద్వారా నేరుగా కంట్రోల్ చేస్తుంది. లోన్లు, ఈఎంఐ ఆప్షన్ల కోసం సెంట్రల్ బ్యాంకు నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలపై పనిచేస్తుంది.
5. పేటీఎం పోస్ట్‌పెయిడ్ (Paytm Postpaid) :
పేటీఎం పోస్ట్‌పెయిడ్ యూజర్లు స్కూల్ ఫీజులతో సహా ఈఎంఐలలో పేమెంట్ సర్వీసులను పొందవచ్చు. తల్లిదండ్రులు స్కూల్ ఫీజులను చెల్లించడానికి వడ్డీ లేకుండా ఈఎంఐలలో (ప్లాన్‌ను బట్టి) చెల్లించవచ్చు.
పేటీఎంలో కూడా BNPL ఆప్షన్ ఉపయోగించవచ్చు. ఇది కూడా ఆర్బీఐ నియంత్రణలో ఉన్న NBFC సంస్థలతో కలిసి పనిచేస్తుంది. పేటీఎం ఒక పేమెంట్స్ బ్యాంకు.. ఆర్బీఐ నియంత్రణ పరిధిలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పనిచేస్తుంది.
6. క్యాష్‌కేర్ (CashCare) :
క్యాష్‌కేర్ అనేది మరో డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్. స్కూల్ ఫీజులతో సహా వివిధ సర్వీసులకు ఈఎంఐ ఆప్షన్లను అనుమతిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల స్కూల్ ఫీజులను సరసమైన నెలవారీ ఈఎంఐలుగా మార్చుకునేందుకు అనుమతిస్తుంది. క్యాష్‌కేర్ ఆర్బీఐ ఆమోదించిన ఆర్థిక సంస్థలు, NBFCలతో కలిసి పనిచేస్తుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా క్యాష్‌కేర్ సర్వీసులను అందిస్తుంది.
7. బజాజ్ ఫిన్‌సర్వ్ (Bajaj Finserv) :
బజాజ్ ఫిన్సర్వ్ అనేది ఈఎంఐ నెట్‌వర్క్ ద్వారా స్కూల్ ఫీజులతో సహా ఎడ్యుకేషన్ పేమెంట్ల కోసం సౌకర్యవంతమైన ఈఎంఐ ఆప్షన్లను అందిస్తుంది. వడ్డీ-బేరింగ్, సున్నా-వడ్డీ ఈఎంఐ ప్లాన్‌లను కూడా పొందవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఆర్బీఐ ఆమోదించిన NBFCతో కలిసి పనిచేస్తుంది. పూర్తిగా ఆర్బీఐ నియంత్రణలో పనిచేస్తుంది. లోన్లు, ఈఎంఐ పేమెంట్ల కోసం మార్గదర్శకాల ప్రకారమే పనిచేస్తుంది.
8. రూపిఫై (Rupifi) :
తల్లిదండ్రులు పిల్లల స్కూల్ ఫీజులను ఈఎంఐలో చెల్లించేందుకు Rupifi విద్యా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సౌకర్యవంతమైన కాలపరిమితితో పాఠశాల ఫీజులను నెలవారీ ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. ఆర్బీఐ నియంత్రిత ఆర్థిక సంస్థలు, NBFCలతో కలిసి పనిచేస్తుంది. డిజిటల్ లోన్లకు ఈఎంఐ ఆప్షన్ల కోసం ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంది.
ఈ ప్లాట్‌ఫామ్‌లకు సాధారణంగా ప్రాథమిక డాక్యుమెంటేషన్ (గవర్నమెంట్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్ మొదలైనవి) అవసరం. వివిధ వడ్డీ రేట్లు, ఈఎంఐ కాలపరిమితి ఆప్షన్లను అందిస్తాయి. పేమెంట్ ఆప్షన్ ఖరారు చేసే ముందు ఈఎంఐలతో లింక్ అయిన ఏవైనా హిడెన్ ఛార్జీలు లేదా రుసుములను ఎల్లప్పుడూ చెక్ చేయండి.
ఇందులో మీకు ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకుంటే.. మీ పిల్లలను చేర్పించిన స్కూల్ ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈఎంఐ పేమెంట్లకు సపోర్టు చేస్తుందో లేదో వెరిఫై చేసుకోండి. ఆ తర్వాతే పేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి.