×
Ad

School Holiday Alert : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 6న స్కూళ్లకు సెలవు ఉందా? మీ ప్రాంతంలో హాలీడే ఉందో లేదో తెలుసుకోండి!

School Holiday Alert : దసరా పండగ సెలవుల తర్వాత ఎప్పటిలాగే మళ్లీ స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. అక్టోబర్ 6న ఏయే రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకోనున్నాయో ఇప్పుడు చూద్దాం..

School Holiday Alert

School Holiday Alert : పండగ సెలవులు ముగిశాయి. విద్యార్థులంతా బడి బాట పట్టనున్నారు. నవరాత్రి, దసరా, దుర్గా పూజ సెలవుల అనంతరం విద్యార్థులంతా తిరిగి స్కూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే, సెలవుల అనంతరం చాలా ప్రాంతాలలో స్కూళ్లు సోమవారం, అక్టోబర్ 6, 2025న తిరిగి తెరుచుకోనున్నాయి. చాలా హాలిడే సెషన్‌లు వారాంతంలోనే ముగిశాయి.

దాంతో విద్యార్థులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు రెగ్యులర్ ఎడ్యుకేషన్ షెడ్యూల్‌లను ప్రారంభించనున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు అక్టోబర్ 6 వరకు సెలవులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఉత్సవాలు లేదా వాతావరణ సమస్యల కారణంగా సెలవులు కొనసాగవచ్చు. ఇంతకీ దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాల్లో సోమవారం నుంచి స్కూళ్లు ఓపెన్ కానున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దసరా తర్వాత స్కూళ్లు పునఃప్రారంభం :
అన్ని రాష్ట్రాల్లో అధికారిక దసరా సెలవులు అక్టోబర్ 3 లేదా 4న ముగిశాయి. అక్టోబర్ 5 ఆదివారం ఉంది. అది ఎలాగో వారంతపు సెలవు. అక్టోబర్ 6న సోమవారం నుంచి యథావిథిగా తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల విద్యా మంత్రిత్వ శాఖలు కూడా స్కూళ్లు తెరిచే ఉంటాయని వెల్లడించాయి.

అక్టోబర్ 6, 2025న రాష్ట్రాల వారీగా స్కూళ్ల సెలవుల వివరాలివే :

తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ :
దసరా సెలవులు అక్టోబర్ 3న ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లు అక్టోబర్ 6న తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే, కొన్ని ప్రైవేట్ స్కూళ్లు వరద ప్రభావిత ప్రాంతాల విద్యార్థుల కోసం ఆప్షనల్ సెలవులు ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్టోబర్ 6న స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Read Also : Samsung Galaxy S25 Ultra : వారెవ్వా.. ఇది కదా ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

ఢిల్లీ :
ఢిల్లీలోని స్కూళ్లకు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు దసరా సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 4 వరకు స్కూళ్లు మూతపడ్డాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 6న తిరిగి తెరుచుకోనున్నాయి. ఈరోజునఈ రోజు స్కూళ్లకు సెలవు లేదు.

పశ్చిమ బెంగాల్‌ :
దుర్గా పూజ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చాలావరకూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇప్పుడు స్కూళ్లు అక్టోబర్ 6 నుంచి పున: ప్రారంభం కానున్నాయి. కొన్ని జిల్లాల్లో స్థానిక ఉత్సవాలకు లోబడి అదనపు రోజు సెలవు ఉండవచ్చు.

కేరళ :
స్థానిక పండుగలు, భారీ వర్షాల కారణంగా మూతపడిన చాలావరకూ స్కూళ్లు సాధారణంగా అక్టోబర్ 6న తిరిగి ప్రారంభం కానున్నాయి. వర్ష హెచ్చరికలు కొనసాగితే ఇడుక్కి, వయనాడ్ వంటి కొన్ని జిల్లాలు అదనపు సెలవులు ప్రకటించవచ్చు.

మహారాష్ట్ర :
సెప్టెంబర్‌లో ఈద్-ఎ-మిలాద్, నవరాత్రి సెలవుల తర్వాత ముంబై, పూణే, ఇతర జిల్లాల్లోని స్కూళ్లు అక్టోబర్ 6న తెరిచుకోనున్నాయి. అదనపు సెలవులు ప్రకటించే పరిస్థితి లేదు.

తమిళనాడు :
ఆయుధ పూజ, దసరా సెలవులు అక్టోబర్ 3 నాటికి ముగుస్తాయి. తమిళనాడులోని చాలా స్కూళ్లు అక్టోబర్ 6న తిరిగి తెరుచుకుంటాయి. ఏదైనా ప్రభుత్వ పరిపాలనా కారణాల వల్ల కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు ఆప్షనల్సెలవు ఉండవచ్చు.

ఒడిశా, అస్సాం :
దసరా సెలవులు తర్వాత అస్సాం, ఒడిశా స్కూళ్లు అక్టోబర్ 6 లేదా 7 తేదీలలో తిరిగి ప్రారంభం కానున్నాయి. కొన్ని జిల్లాల్లోని స్థానిక పండగులు, వాతావరణ పరిస్థితుల కారణంగా అధికారులు సెలవులు పొడిగించవచ్చు.

పండుగ సెలవుల అనంతరం అక్టోబర్ 6, 2025 నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎప్పటిలాగే స్కూళ్లకు తిరిగి రానున్నారు. అయితే, చాలా స్కూళ్లు తెరుచుకోనున్నప్పటికీ స్థానిక పండుగలు, వాతావరణ హెచ్చరికల కారణంగా కొన్ని ప్రాంతాలకు సెలవులు ఉండొచ్చు.