Schools Colleges : సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థల పునఃప్రారంభం

తెలంగాణలో విద్యాసంస్థల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ముందుగా 8వ తరగతి, ఆపై తరగతుల

Schools Colleges : తెలంగాణలో విద్యాసంస్థల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ముందుగా 8వ తరగతి, ఆపై తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రగతి భవన్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఈ విషయమై సీఎం సమీక్ష నిర్వహించారు.

మరోవైపు.. తెలంగాణలో విద్యా సంస్థలను తెరుచుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే సీఎంఓకు నివేదికను సమర్పించింది. విద్యా సంస్థలు తిరిగి తెరిచే విషయంలో విద్యాశాఖ కూడా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.

రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేసిన జూలై 1వ తేదీ నుంచే విద్యాసంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. కరోనా థర్డ్‌వేవ్ రానుందన్న నిపుణుల హెచ్చరికలతో ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవలేదు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్ 1 నుంచి తిరిగి విద్యాసంస్థలను తెరవడంపై అధికారులతో చర్చలు జరిపింది. చర్చల అనంతరం విద్యా సంస్థల పున:ప్రారంభంపై స్పష్టత వచ్చింది. కాగా, క్లాసుల నిర్వహణకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు